అసెంబ్లీలో పరువు పోకముందే సీఎం పళనిసామి రాజీనామా చెయ్యాలి: తంగ తమిళ్ సెల్వన్ !
సీఎం పళనిస్వామి స్వయంగా రాజీనామా చేస్తే పరువు ఉంటుందిఎమ్మెల్యేల బలపరీక్ష అంటే పరువు పోతుంది, తంగ తమిళ్ సెల్వన్మీకు సీఎం పదవి భిక్ష పెట్టిన శశికళ, దినకరన్ ను విమర్శిస్తావా, చూస్తాం
బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి శాసన సభలో బలపరీక్ష నిర్వహించి పరువుపోగుట్టుకోక ముందే ఇప్పుడే మర్యాదగా ఆయనే స్వయంగా సీఎం పదవికి రాజీనామా చేస్తే ఆయనకే గౌరవంగా ఉంటుందని టీటీవీ దినకరన్ గ్రూప్ లోనిఎమ్మెల్యే తంగ తమిళ్ సెల్వన్ అన్నారు.
శనివారం కర్ణాటకలోని కొడుగు సమీపంలోని రిసార్ట్ దగ్గర తంగ తమిళ్ సెల్వన్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిని చేసి ఆ పదవిని భిక్షగా పెట్టిన శశికళ, టీటీవీ దినకరన్ ను నేడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ఎదిరించి మాట్లాడుతున్నారని తంగ తమిళ్ సెల్వన్ మండిపడ్డారు.

సీఎం పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గాలు ఒక్కటి అయ్యి నేడు తమిళనాడు ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేసి ప్రజల సోమ్మును స్వాహా చేస్తున్నారని తంగ తమిళ్ సెల్వన్ ఆరోపించారు. ఇలాంటి నాయకులను ఆ దేవుడుకూడా క్షమించరని, అందుకే వారికి బుద్ది చెప్పడానికి తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశామని అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యే తంగ తమిళ్ సెల్వన్ చెప్పారు.












Click it and Unblock the Notifications