తమిళనాడు మంత్రివర్గ అత్యవసర సమావేశం, పన్నీర్ సెల్వంకు పదవి వచ్చిన తరువాత !
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి నేతృత్వంలో ఆ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి నేతృత్వంలో ఆ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అత్యవసరంగా ఏర్పాటు చేసిన మంత్రి వర్గ సమావేశంలో పలు సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెసింది.
తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటి సారి జరుగుతున్న మంత్రి వర్గ సమావేశంపై అందరి కన్ను పడింది. చెన్నైలోని సచివాలయంలో బుధవారం ఉదయం 11.15 గంటలకు మంత్రి వర్గ సమావేశం నిర్వహిస్తున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో సహ పలువురు సీనియర్ మంత్రులు ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టారు. ముఖ్యంగా సెవన్త్ పే కమిషన్ శిఫారస్సు విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటున్నారని తెలిసింది.
తమిళనాడులో డెంగ్యూ జ్వరం తాండవం చేస్తోంది. తమిళనాడు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 34 మంది డెంగ్యూ వ్యాదికి బలి అయ్యారు. డెంగ్యూ వ్యాదిని అరికట్టడానికి తీసుకోవలసిన చర్యలపై ఓ కమిటీ వేసే అవకాశం ఉందని తెలిసింది. మంత్రి వర్గ సమావేశంలో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గొంటున్నారు.












Click it and Unblock the Notifications