జయలలిత మృతి చెందినట్లు మీడియాలో వదంతులు
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్ జయలలిత సోమవారం మరణించారని సాయంత్రం 5.15 నిమిషాలకు మృతి చెందినట్లుగా వార్తలు వచ్చాయి.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్ జయలలిత సోమవారం మరణించారని సాయంత్రం 5.15 నిమిషాల నుంచి ప్రచారం జరిగింది. జయలలిత చికిత్స విఫలమై మరణించాని ప్రకటించడంతో తమిళనాడులో విషాదం కనిపించింది.
జయలలిత మరణించారని ఓ వైపు ప్రచారం జరిగినా, అపోలో ఆసుపత్రి వైద్యులు మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. అన్నాడీఎంకే పార్టీ నాయకులు మాత్రం ఈ విషయంలొ మౌనం వహిస్తున్నారు.

అపోలో ఆసుపత్రితో సహా తమిళనాడులోని వివిద జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఫ్లక్సీలు, హోడ్డింగ్స్ ధ్వంసం చేశారు. చెన్నై నగరంతో పాటు తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రయివేటు వాహనాలకు నిప్పంటించారు. జయలలిత అభిమానులు సహనం కోల్పోయి ఆందోళనలు చెయ్యడంతో పోలీసులు హడలిపోతున్నారు. పరిస్థితిని అదుపు చెయ్యడానికి పారా మిలటరీ బలగాలను రంగంలోకి దింపారు.












Click it and Unblock the Notifications