జయ ఆరోగ్య బులిటెన్స్ 50% ప్రజలు నమ్మడం లేదు: సర్వే

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై విడుదల అవుతున్న బులిటెన్స్ మీద మాకు నమ్మకం లేదని తమిళ ప్రజలు అంటున్నారు. జయలలిత ఆరోగ్యంపై విడుదల అవుతున్నబులిటెన్లు మీరు నమ్ముతున్నారా అంటే 50 శాతం మంది నమ్మడం లేదంటున్నారు.

తమిళనాడుకు చెందిన నక్కినర్ పత్రిక జయలలిత ఆరోగ్యంపై ప్రజలు ఏమనుకుంటున్నారు అని సర్వే చేసింది. తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు చెందిన 10 వేల మంది దగ్గర నుంచి అభిప్రాయాలు సేకరించింది.

జయలలిత ఆరోగ్యం విషయంలో ఆసుపత్రి వర్గాలు విడుదల చేస్తున్న బులిటెన్లు మేము నమ్మడం లేదని 50 శాతం ప్రజలు చెప్పారని గురువారం నక్కిరన్ వెల్లడించింది. 27 శాతం మంది ఆసుపత్రి విడుదల చేస్తున్న బులిటెన్స్ నమ్ముతున్నామని చెప్పారు.

Tamil Nadu CM Jayalalithaa's health:Nakkhheeran Survey

23 శాతం మంది బులిటెన్స్ అంత అపద్దం అని చెప్పారని నక్కిరన్ తెలిపింది. వివిధ పార్టీల నాయకులు నిజంగా జయలలిత మీద అభిమానంతో ఆసుపత్రికి వెలుతున్నారా అని సర్వే చేసింది.

పబ్లిసిటి కోసం వెలుతున్నారని 45 శాతం మంది చెప్పారని, అభిమానంతో వెలుతున్నారని 24 శాతం మంది, రాజకీయ లబ్దికోసం వెలుతున్నారని 31 శాతం మంది చెప్పారని నక్కిరన్ తెలిపింది.
అమ్మ త్వరగా కోలుకోవాలని తాము కోరుకుంటున్నామని ప్రజలు చెప్పారని నక్కిరన్ వెల్లడించింది.

జయలలిత ఆరోగ్యం విషయంలో రోజుకోక వార్త చక్కర్లు కొడుతుండటంతో అమ్మ అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అన్నాడీఎంకే నాయకులు మాత్రం అమ్మ కోలుకుంటున్నారని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+