చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దటీజ్ స్టాలిన్ : కారు ఆపి.. కరోనా రూల్స్ చెప్పి.. రోడ్డుపై వ్యక్తులకు మాస్క్ తొడిగిన సీఎం

|
Google Oneindia TeluguNews

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వెంటాడుతోంది. లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంది. థర్డ్ వేవ్ ముంచుకోస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని డబ్యూహెచ్‌వో స్పష్టం చేసింది. ప్రపంచ దేశాలు తమ పౌరులు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ఆంక్షలు విధించాయి. ఈ నిబంధనలు పాటించని వారికి పోలీసులు భారీగా జరిమానా కూడా విధిస్తున్నారు. అయినా కూడా కొందమంది నిర్లక్ష్యం వహిస్తూ మాస్కులు ధరించడంలేదు. ఇలాంటి వారు చెన్నై నగర రోడ్లపై సీఎం స్టాలిన్ కంటపడ్డారు. దీంతో వెంటనే కాన్వాయ్ ని ఆపించేశారు. మాస్కులు లేనివారికి వాటిని అందించారు. కొందరికి ఆయనే స్వయంగా మాస్క్ లు తొడిగారు.

రోడ్‌పై వ్య‌క్తుల‌కు మాస్క్ తొడిగిన స్టాలిన్..

కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం స్టాలిన్ , ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ , ఇతర ఉన్నతాధికారులతో కలిసి చెన్నైలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయానికి బయలుదేరారు. అన్నాసలై ప్రాంతంలో చాలా మంది మాస్కులు లేకుండా తిరుగడం ముఖ్యమంత్రి కంటపడింది. దీంతో వెంటనే తన కాన్వాయ్‌ను ఆపించేశారు. మాస్కు లేకుండా తిరుగుతున్న వారి దగ్గరకి స్టాలిన్‌నే స్వయంగా వెళ్లారు. కరోనా నింబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మాస్కులు లేని వారికి వాటిని అందించారు. కొందరికి స్టాలిన్‌నే స్వయంగా మాస్క్ లు తొడిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మాస్క్‌పై అవ‌గాహ‌న‌..

సీఎం స్టాలిన్ అంతటితో ఆగకుండా .. బస్ స్టాండ్స్, షాపుల వద్దకు వెళ్లి మాస్కులు ధరించని వారికి వాటి అందించారు. కరోనా , ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందరూ బాధ్యతగా ఉండాలన్నారు. వైరస్ కట్టడికి వైద్యుల సలహాలను, నిబంధనలు అతిక్రమిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని నిర్లక్ష్యం వహించవద్దని అవగాహన కల్పించారు.

నిబంధ‌న‌లు అతిక్ర‌మ‌ణ

నిబంధ‌న‌లు అతిక్ర‌మ‌ణ

కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని వైద్య నిపుణులు, అధికారులు సూచిస్తున్నారు. గాలి ద్వారా వ్యాపించే ఈ వైరస్‌ను కట్టడి చేయాలంటే మాస్కే కీలకమని డబ్యూహెచ్‌వో స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వాళ్లు తప్పనిసరిగా మాస్కు పెట్టుకోవాలని ఎంత మొత్తుకుంటున్నా కొందరు మాత్రం పట్టించుకోవ‌డంలేదు. ఫలితంగా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి.

 క‌రోనా ఉద్ధృతి

క‌రోనా ఉద్ధృతి

దేశంలో కరోనా ఉద్ధృతి మరోసారి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 37,379 కొత్త కేసులు నమోదయ్యాయి. 124 మంది మరణించారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా వేగంగా వ్యాప్తి చెందుతుంది. దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసులు సంఖ్య 1892కి చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 568, ఢిల్లీలో 382 కేసులు నమోదయ్యాయి. మొత్తం 23 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. ఈనేపథ్యంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అప్రమత్తమైయ్యాయి. ఆంక్షలను కఠినతరం చేశాయి..

English summary
CM MK Stalin put mask to road side person who violate corona rules
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X