అభినందన్ కు పరమవీర చక్ర ఇవ్వండి .. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం పళని లేఖ
చెన్నై : శత్రుదేశం యుద్ధవిమానాలను సమర్థవంతంగా తిప్పికొట్టిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కు క్రేజీ పెరిగిపోతోంది. ఇప్పటికే ఆయన మీసాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవగా .. జాతి ఆయన సేవలను కీర్తించింది. అన్నిరంగాల వారు అభినందన్ ధైర్య సాహసాలను అభినందించారు. తమ రాష్ట్రానికి చెందిన అభినందన్ ను ప్రతిష్టాత్మక పరమవీర చక్ర ఇవ్వాలని ప్రధాని మోదీని లేఖలో కోరారు ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి.

వీరునికి పరమవీర చక్ర ఇవ్వండి ..
భరతమాత ముద్దుబిడ్డ అభినందన్ కు పరమవీర చక్ర ఇవ్వాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు తమిళనాడు సీఎం పళనిస్వామి. పరమవీర చక్ర అంటే సైన్యంలో అత్యధిక గౌరవం గల రివార్డు. 'పాకిస్థాన్ యుద్ధ విమానాలను కూల్చి .. ఆ దేశ భూభాగంలో చిక్కి ధైర్య సాహసాలను ప్రదర్శించిన అభినందన్ పరమవీర చక్ర అవార్డుకు అర్హుడని భావిస్తున్నా, పాకిస్థాన్ చెర నుంచి అభినందన్ దౌత్యపరంగా చర్చల ద్వారే విడుదలయ్యారు. ఇందుకోసం మీరు అంతర్జాతీయంగా పాకిస్థాన్ పై తీసుకొచ్చిన ఒత్తిడి తీసుకొచ్చారని' లేఖలో గుర్తుచేశారు పళనిస్వామి.
ఎస్పీ ఫస్ట్ రిలీజ్ .. మెయిన్ పురి నుంచి బరిలోకి ములాయం

మన హృదయాలు గెలిచారు
శత్రుదేశంలో పట్టుబడి .. ఇంటికి చేరిన అభినందన్ మన హృదయాలు గెలిచారు. అలాంటిది పరమవీర చక్ర అవార్డు ఇచ్చి గౌరవించుకుందామని కోరారు. ఓ ఫైలట్ గా దిగ్విజయంగా పనిచేసిన అభినందన్ .. అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. దాయాది నుంచి ముప్పును పసిగట్టి .. సమర్థంగా తిప్పికొట్టారని .. లేదంటే ఊహించని నష్టం వాటిల్లేదని అభిప్రాయపడ్డారు. ఓ సైనికుడిగా అభినందన్ ప్రదర్శించిన ధైర్య సాహసాలను గుర్తించి .. అవార్డు అందజేయాలని కోరారు.












Click it and Unblock the Notifications