వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్పీ ఫస్ట్ రిలీజ్ .. మెయిన్ పురి నుంచి బరిలోకి ములాయం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : రాజకీయ పార్టీల్లో సార్వత్రిక ఎన్నికల హీట్ పుట్టిస్తోంది. ఐదు, ఆరు రోజుల్లో షెడ్యూల్ విడుదలవుతుందనే సంకేతాలతో .. ఎన్నికల బరిలో బిజీగా ఉన్నాయి. అభ్యర్థుల జాబితాపై ఫోకస్ చేశాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 15 మందితో జాబితా రూపొందించగా .. సమాజ్ వాదీ పార్టీ కూడా ఆరుగురితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది.

<strong>ముసి ముసి నవ్వులు నవ్విండు ఔతల పడ్డాడు .. మోదీపై కేటీఆర్ సెటైర్లు</strong>ముసి ముసి నవ్వులు నవ్విండు ఔతల పడ్డాడు .. మోదీపై కేటీఆర్ సెటైర్లు

ఆరుగురితో ఫస్ట్ లిస్ట్

ఆరుగురితో ఫస్ట్ లిస్ట్

ఎస్పీ తొలి జాబితాలో ఆరుగురికి చోటు దక్కింది. వీరిలో ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఉన్నారు. ములాయంతోపాటు తన బాబాయి రాంగోపాల్ యాదవ్ కుమారులు ధర్మేంద్ర యాదవ్, అక్షయ్ యాదవ్ కు సీటు కేటాయించారు అఖిలేశ్ యాదవ్.

గెలుపు నల్లేరు మీద నడకే ..

గెలుపు నల్లేరు మీద నడకే ..

2014 లోక్ సభ ఎన్నికల్లో ములాయం సింగ్ యాదవ్ మెయిన్ పురి, అజాంఘడ్ రెండు చోట్ల పోటీచేసి .. గెలుపొందారు. ఈసారి మాత్రం మెయిన్ పురి టికెట్ మాత్రమే ఎస్పీ చీఫ్ అఖిలేశ్ కన్ఫామ్ చేశారు. ఎందుకంటే .. మెయిన్ పురిలో ములాయం సింగ్ యాదవ్ గెలుపు నల్లెరు మీద నడకేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. 1996, 2004, 2009, 2014 లోక్ సభ ఎన్నికల్లో మెయిన్ పురి నుంచి పోటీ చేసి గెలుపొందారు ములాయం సింగ్ యాదవ్. ఎస్పీకి పెట్టిన కోట అయిన ఇక్కడినుంచి బరిలోకి దింపతే .. విజయం తథ్యమనే అభిప్రాయంతో సీటు కేటాయించినట్టు తెలుస్తోంది.

యూపీలో ఎస్పీ, బీఎస్పీ పొత్తు

యూపీలో ఎస్పీ, బీఎస్పీ పొత్తు

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైరివర్గాలైన ఎస్పీ, బీఎస్పీ ఒక్కటయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించాయి. 80 సీట్లలో ఈ రెండు పార్టీలు సీట్లు పంచుకుంటాయి. అయితే రాహుల్ గాంధీ, సోనియా బరిలోకి దిగే అమేథీ, సోనియాగాంధీ నియోజకవర్గాల్లో మాత్రం పోటీచేయమని స్పష్టంచేసింది. బీజేపీని ఎదుర్కొని .. మెజార్టీ స్థానాలు సాధించాలని అఖిలేశ్, మాయావతి భావిస్తున్నారు.

English summary
the Samajwadi Party has released its first candidate list for upcoming Lok Sabha elections. Party patriarch Mulayam Singh Yadav will be contesting elections from Mainpuri in Uttar Pradesh. In addition to Mulayam Singh Yadav, SP is also fielding family members of Mulayam Singh Yadav like nephew Dharmendra Yadav from Badaun and his brother and senior SP leader Ram Gopal Yadav's son Akshay Yadav from Firozabad. The list, released on Friday morning, has declared candidates for 6 Lok Sabha seats in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X