పీఎం అయినా ఓకే అంటున్న క్యాప్టెన్ (ఫోటోలు)

చెన్నై: తనను ముఖ్యమంత్రి, గవర్నర్ పదవులతో పాటు ప్రధాని పదవికి ఎంపిక చేసినా ఓకే, అయితే తాను సరైన సమయంలో ఓ నిర్ణయం తీసుకుంటానని డీఎండీకే అధినేత విజయ్ కాంత్ అంటున్నారు. కార్యకర్తలకు తెలియకుండా తాను ఏ నిర్ణయం తీసుకోనని స్పష్టం చేశారు.

తమిళనాడు శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో విజయ్ కాంత్ కు భారీ డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా ఆయన ఎవరితో చేతులు కలిపితే విజయం వాళ్లదే అంటూ పలు పార్టీల నాయకులు ఆయనతో పొత్తుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే విజయ్ కాంత్ మాత్రం నోరు జారకుండా జాగ్రత్త పడుతున్నారు.

కొంత కాలంగా విజయ్ కాంత్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఆదివారం చెన్నై నగరంలోని అడయార్, తండయార్, మధ్య కైలాష్ ప్రాంతాల్లో డీఎండీకే రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసింది.

విజయ్ కాంత్ హాజరు

విజయ్ కాంత్ హాజరు

మధ్య కైలాష్ ప్రాంతంలో రక్త దాన, వైద్య శిబిరాన్ని డీఎండీకే చీఫ్ క్యాప్టెన్ విజయ్ కాంత్ ప్రారంభించారు.

హుషారుగా మీడియా ముందుకు

హుషారుగా మీడియా ముందుకు

చాల కాలం తరువాత విజయ్ కాంత్ మీడియా ముందుకు వచ్చారు. మీడియా వేసిన ప్రశ్నలకు ఆచూతూచి సమాధానం ఇచ్చారు.

మూడు సమావేశాల తరువాత చెబుతాం

మూడు సమావేశాల తరువాత చెబుతాం

డీఎండీకే పార్టీ కార్యవర్గ సమావేశం, సర్వసభ్య సమావేశం, చివరిగా మహానాడులో కార్యకర్తలతో సమావేశం పూర్తి అయిన తరువాత తను ఎవరితో కలిసి పనిచేస్తాను అని వెల్లడిస్తానని క్యాప్టెన్ అన్నారు.

అందరికి థ్యాక్స్

అందరికి థ్యాక్స్

తనను ఆహ్వానిస్తున్న అన్ని పార్టీల నాయకులకు ఇదే సందర్బంలో కృతజ్ఞతలు తెలుపుతున్నానని విజయ్ కాంత్ అన్నారు.

ఏ పార్టీతో అంటే

ఏ పార్టీతో అంటే

తాను ఏ పార్టీతో కలిసి పని చేస్తాననే విషయం ఇప్పుడే చెప్పలేనని, కార్యకర్తలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని విజయ్ కాంత్ చెప్పారు.

బీజేపీ, డీఎంకే, మహాకూటమి, కాంగ్రెస్ క్యూ

బీజేపీ, డీఎంకే, మహాకూటమి, కాంగ్రెస్ క్యూ

ఇప్పటికే బీజేపీ, డీఎంకే, మహాకూటమి నాయకులు విజయ్ కాంత్ తో చర్చించి ఎన్నికల్లో కలిసి పోటీ చెయ్యాలని మనవి చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ సైతం విజయ్ కాంత్ ను ఆహ్వానిస్తున్నది.

ప్రభుత్వంపై మండిపాటు

ప్రభుత్వంపై మండిపాటు

తమిళనాడు ప్రభుత్వంపై విజయ్ కాంత్ మండిపడ్డారు. పార్లమెంట్, రాజ్యసభలో అన్నా డీఎంకేకు సుమారు 49 మంది సభ్యులు ఉన్నారని, అయినా ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని విమర్శించారు.

పరోక్షంగా బీజేపీ మీద

పరోక్షంగా బీజేపీ మీద

పనిలో పనిగా బీజేపీ, డీఎంకే పార్టీల మీద పరోక్షంగా మండిపడ్డారు. తాను ప్రజల మనిషిని. సరైన సమయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

ఆయన మంచి నిర్ణయం తీసుకుంటారు

ఆయన మంచి నిర్ణయం తీసుకుంటారు

రక్తదానం చేసిన క్యాప్టెన్ సతీమణి ప్రేమలత విజయ్ కాంత్ మీడియాతో మాట్లాడుతూ మా ఆయన త్వరలో సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

అధికారంలో భాగస్వామ్యం ఇస్తే

అధికారంలో భాగస్వామ్యం ఇస్తే

అధికారంలో భాగస్వామ్యం ఎందుకు, మేమే అధికారంలో ఉంటామని విజయ్ కాంత్ ధీమా వ్యక్తం చేశారు. తిక్కతిక్క ప్రశ్నలు వేస్తున్నారంటూ ఆయన మీడియా మీద రుసరుసలాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+