Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సంక్రాంతికి రూ. 3,000 నగదు, గిఫ్ట్ హ్యాంపర్: ఎన్నికల వేళ..

ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది.. తమిళనాడు. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకేతో పాటు తమిళగ వెట్రి కజగం.. (TVK) పూర్తి స్థాయి ఎన్నికల సంగ్రామానికి దిగబోతోంది. ఫలితంగా త్రిముఖ పోటీ నెలకొంది. టీవీకే తరఫున ప్రముఖ నటుడు దళపతి విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని టీవీకే ఇదివరకే అధికారికంగా ప్రకటించింది కూడా.

దీంతో ఈ ఎన్నికలను డీఎంకే ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకోవడానికి తనవంతు ప్రయత్నాలు మొదలు పెట్టింది. తాజాగా సంక్రాంతి పండుగ కానుకలను ఇవ్వాలని డీఎంకే ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ త్వరలోనే ఓ ప్రకటన చేయనున్నారు. సంక్రాంతి గిఫ్ట్ హ్యాంపర్ తో పాటు 3,000 రూపాయల నగదు సహాయాన్ని కూడా అందించడానికి ఏర్పాట్లు చేపట్టింది.

Tamil Nadu Families Could Receive Rs 3 000 Cash Aid and Pongal Gift Hamper

ఈ పొంగల్ కు 248 కోట్ల రూపాయలతో కానుకలను ఇదివరకే ఖరారు చేసింది మంత్రివర్గం. ఇందులో కిలో చొప్పు బియ్యం, చక్కెర, ఒక చెరకు గడను ఇవ్వాలని తీర్మానించింది. వీటిని రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల ద్వారా తెల్లరేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తారు. 3,000 రూపాయల గిఫ్ట్ హ్యాంపర్ లేదా నగదు బహుమతిని ఇవ్వడంపై అప్పట్లో నిర్ణయం తీసుకోలేదు. దీనిపై కొంత గందరగోళం నెలకొన్నప్పటికీ.. ఇప్పుడు తెర పడింది.

2021లో అప్పటి ఏఐఏడీఎంకే ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు పొంగల్ బహుమతి ప్యాకేజీతో పాటు 2,500 రూపాయల నగదును అందించింది. ఆ మరుసటి సంవత్సరమే అధికారంలోకి వచ్చిన డీఎంకే కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించింది. 2022, 2023, 2024 లో 1,000 .రూపాయల నగదును కలిపి సంక్రాంతి ప్యాకేజీని పంపిణీ చేసింది. 2025లో దీనికి బ్రేక్ పడింది. నగదు లేకుండా సంక్రాంతి కానుకలను మాత్రమే పంపిణీ చేయడంతో లబ్ధిదారులు నిరాశ చెందారు.

దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఎన్నికల ఏడాది కూడా కావడంతో సంక్రాంతి నగదు పంపిణీని పునరుద్ధరించాలని నిర్ణయించింది. గత ఏడాది మొత్తాన్ని కూడా కలిపి 3,000 రూపాయలను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పొంగల్ బహుమతి ప్యాకేజీతో పాటు 3,000 రూపాయల నగదు పంపిణీ జనవరి 8వ తేదీన ప్రారంభం కానుంది. పంపిణీ సాఫీగా సాగడానికి ముందే లబ్దిదారులకు టోకెన్లు అందజేస్తారు.

ఈ పథకం తమిళనాడులోని అన్ని రేషన్ దుకాణాల ద్వారా రైస్ కార్డ్ హోల్డర్లతో పాటు ఇతర అర్హతగల రేషన్ కార్డ్ వర్గాలకు వర్తిస్తుంది. రద్దీ నివారణకు ప్రతి అవుట్‌లెట్‌లో రోజుకు సుమారు 400 మంది రేషన్ కార్డుదారులకు ప్రయోజనాలు పంపిణీ చేయాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 14 నాటికి ప్యాకేజీలు, రూ.3,000 నగదు సహాయ పంపిణీని రాష్ట్రవ్యాప్తంగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+