11 మంది సజీవదహనం: టూరిస్టు గైడ్ అరెస్టు, మహిళలు, పిల్లలతో చెలగాటం!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడులోని తేనీ జిల్లాలోని కురంగణి అటవీ ప్రాంతంలో జరిగిన ఆకస్మిక అగ్నిప్రమాదం మృతుల సంఖ్య 11కు చేరింది. అటవి శాఖ అధికారుల అనుమతి లేకుండా ట్రెక్కింగ్ కు తీసుకెళ్లిన టూరిస్టు గైడ్ రంజిత్ (30)ను తమిళనాడు పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

కురంగణి పర్వతాల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 8మంది మహిళలు, ముగ్గురు పురుషులు మరణించారని మంగళవారం పోలీసులు తెలిపారు. నియమాలు ఉల్లంఘించి చెన్నైకి చెందిన 24 మంది, ఈరోడ్, తిరుపూర్ జిల్లాకు చెందిన 12 మందిని కురంగణి పర్వతాల్లోకి తీసుకెళ్లారని పోలీసులు కేసు నమోదు చేశారు.

Tamil Nadu forest fire: Tourist guide arrested on Tuesday

11 మంది సజీవదహనం కావడానికి, 7 మందికి తీవ్రగాయాలు కావడానికి టూరిస్టు గైడ్ రంజిత్ కారణం అని కేసు నమోదు అయ్యింది. రంజిత్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఈ కేసు పలుకోణాల్లో విచారణ చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 30-year-old man, believed to be a tour guide who led a 36 member trekking group on an ill-fated expedition in the district, has been arrested, police said on Tuesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి