మోడీతో పన్నీర్ భేటీ: దెబ్బకు దెబ్బ, హడలిపోతున్న పళని టీం!

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ/చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే (పురుచ్చితలైవి అమ్మ) పార్టీ నాయకుడు పన్నీర్ సెల్వం ఢిల్లీ చేరుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీతో పన్నీర్ సెల్వం నేటి సాయంత్రం 4.30 గంటలకు సమావేశం కానున్నారు.

తమిళనాడులో తాజాగా చోటుచేసుకున్న రాజకీయాల గురించి ప్రధాని నరేంద్ర మోడీకి వివరించడానికి పన్నీర్ సెల్వం ఢిల్లీ చేరుకున్నారని ఆయన వర్గంలోని సీనియర్ నాయకులు అంటున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఢిల్లీ చేరుకోవడంతో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి.

ప్రధానితో సన్నిహితంగా పన్నీర్

ప్రధానితో సన్నిహితంగా పన్నీర్

ప్రధాని నరేంద్ర మోడీతో పన్నీర్ సెల్వం సన్నిహితంగానే ఉంటున్నారు. ప్రధాని మోడీ తనతో సమావేశం కావడానికి పన్నీర్ సెల్వంకు సమయం కేటాయించడంతో శశికళ వర్గంలో హడలిపోయింది. తమిళనాడులోని తాజా రాజకీయాల గురించి పన్నీర్ సెల్వం ప్రధాని మోడీతో చర్చించనున్నారు.

ఏం మాట్లాడుతారు ?

ఏం మాట్లాడుతారు ?

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వెంట ఆయన వర్గంలోని సీనియర్ నాయకులు మధుసూదనన్, ఎంపీ మైత్రేయన్, మనోజ్ పాండియన్ ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పన్నీర్ సెల్వం ఏ విషయాలు చర్చిస్తారు ? అంటూ పళనిసామి వర్గం ఆందోళన చెందుతున్నారు.

దెబ్బకుదెబ్బ తియ్యాలని

దెబ్బకుదెబ్బ తియ్యాలని

శశికళ వర్గాన్ని దెబ్బకుదెబ్బ తియ్యాలని పన్నీర్ సెల్వం ఢిల్లీ చేరుకున్నారని తెలిసింది. ఇటీవల తమిళనాడులో జరిగిన ఐటీ దాడుల్లో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ అడ్డంగా చిక్కిన విషయం తెలిసిందే. అవినీతిలో కూరుకుపోయిన పళనిసామి ప్రభుత్వాన్ని మళ్లీ ఇరకాటంలో పెట్టడానికి పన్నీర్ సెల్వం ప్రయత్నిస్తున్నారని తెలిసింది.

ఎన్నికల కమిషన్ తో దినకరన్ కు చెక్ !

ఎన్నికల కమిషన్ తో దినకరన్ కు చెక్ !

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శుక్రవారం ఎన్నికల చీఫ్ కమిషనర్ నజీమ్ జిద్దీతో భేటీకానున్నారు.
రెండాకుల చిహ్నం విషయంపై తమ వాదనను ఎన్నికల కమిషన్ కు వినిపించడానికి పన్నీర్ సెల్వం అన్నీ సిద్దం చేసుకుని వెళ్లారని తెలిసింది.

జల్లికట్టు విషయంలో

జల్లికట్టు విషయంలో

తమిళనాడులో జల్లికట్టు నిర్వహించడానికి ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చే సమయంలో తనకు పూర్తిగా సహకరించి గురువారం అనారోగ్యంతో మరణించిన అనిల్ మాధవ్ ధావేకు పన్నీర్ సెల్వం శుక్రవారం నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారని ఆయన సన్నిహితులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tamil Nadu former CM Panneerselvam has left for the capital. He was accompanied by seniors of his group Madhusudhanan, Maitreyan MP and Manoj Pandian. He is slated to call on the PM at 4.30 pm today, sources said. During the meeting, the two would discuss the present political situation of Tamil Nadu, it is said.
Please Wait while comments are loading...