రాజీవ్ హంతకుల విడుదల అంశం గవర్నర్ చేతిలో ఉంది : పళనిస్వామి
చెన్నై : దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులు సంవత్సరాల తరబడి జైలుశిక్ష అనుభవిస్తున్నారు. అయితే వారిని విడుదల చేసే విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు సీఎం పళనిస్వామి. వారిని విడుదల చేసేందుకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.
అయితే వారి విడుదలకు సంబంధించి మంత్రివర్గం ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ నిర్ణయం పెండింగ్‌లో ఉందన్నారు. ఈ మధ్య రాజీవ్ హత్య కేసు దోషులను విడుదల చేయాలని అటు విపక్షాల నుంచి ఇటు ప్రజాసంఘాల నుంచి పెద్దఎత్తున వత్తిడి పెరగడంతో.. తాజాగా పళనిస్వామి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఇదివరకు రాజీవ్ గాంధీ హంతకులను రిలీజ్ చేయాలని వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జైలుశిక్ష అనుభవిస్తున్న ఏడుగురు నిందితులను విడుదల చేయాలని గతేడాది సెప్టెంబర్ నెలలో పళనిస్వామి కేబినెట్ తీర్మానించింది. ఆ మేరకు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్‌కు నివేదిక పంపింది. గవర్నర్ నిర్ణయం తీసుకుంటే వారిని వదిలిపెట్టడానికి మార్గం సుగమం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల మనోభిష్టం మేరకు వారిని గౌరవిస్తూ రాజీవ్ హంతకుల విడుదలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసిందని చెప్పుకొచ్చారు.
పెరంబుదూర్‌లో 1991 మే 21న ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఎల్‌టీటీఈ ఆత్మాహుతి బాంబర్లు రాజీవ్‌గాంధీని హత్య చేశారు. ఆ కేసుకు సంబంధించి నళిని, రవిచంద్రన్, జయకుమార్, మురుగన్, శంతన్, పెరరివలన్, రాబర్ట్ పాయాస్ శిక్ష అనుభవిస్తున్నారు. అయితే వారి విడుదల విషయం గవర్నర్ చేతిలోనే ఉందంటున్నారు పళనిస్వామి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications