వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోరాబ్జీ: గవర్నర్ వాయిదావేయలేరు, కోర్టు తీర్పు కోసం వెయిటింగ్

గవర్నర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడాన్ని కొంత కాలం వాయిదా వేసే అవకాశం ఉంటుంది. కాని, సుదీర్ఘకాలం వాయిదా వేసే అవకాశం ఉండదని మాజీ అటార్నీ జనరల్ సోలీసోరాబ్జీ చెప్పారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో మాజీ అటార్నీ జనరల్ సోలీసోరాబ్జీ స్పందించారు. అయితే ఎవరినైనా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకుండా గవర్నర్ అడ్డుకోలేరని ఆయన ఆభిప్రాయపడ్డారు.

అన్నాడిఎంకె శాసనసభపక్ష నాయకురాలిగా శశికళ ఎన్నికైనట్టుగా గవర్నర్ కు ఎంఏల్ఏల సంతకాలతో కూడిన పత్రాలను సమర్పించారు.అయితే ఈ ఎంఏల్ఏల సంతకాలు ఫోర్జరీ చేశారని అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రకటించారు.

జయలలిత అక్రమాస్తుల కేసు తీర్పు వచ్చే వరకు శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే విషయమై వేచిచూసే ధోరణిని అవలంభిస్తున్నారు.

soli sorabjee

అయితే భారత మాజీ అటార్నీ జనరల్ సోలీ సోరాబ్జీ జాతీయ మీడియాల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చారు.ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని వాయిదావేసే హక్కు గవర్నర్ కు ఉంటుందన్నారు.అయితే జయలలిత అక్రమాస్తుల కేసులో తీర్పు వచ్చేవరకు ప్రమాణస్వీకారం శశికళను ఆహ్వనించకుండా వాయిదా వేసే అధికారం గవర్నర్ కు ఉంటుందన్నారు.

అయితే గవర్నర్ తన నిర్ణయాన్ని నిరవధికంగా వాయిదా వేసే అవకాశం లేదన్నారు. వచ్చే వారంలో తీర్పు వెలువడకుంటే కేబినేట్ సలహ ప్రకారం గవర్నర్ వ్యవహరించాల్సిన అవకాశం ఉంటుందన్నారు.

వచ్చే బుదవారం నాడు కోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ విషయమై తమిళనాడు గవర్నర్ తనను న్యాయ సలహ అడిగారని ఆయన చెప్పారు. తన అభిప్రాయాన్ని గవర్నర్ కు చెప్పినట్టుగా ఆయన చెప్పారు.

గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించడం లేదని శశికళ వర్గం ఆరోపిస్తున్న తరుణంలో సోలీసోరాబ్జీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకొన్నాయి.

English summary
Sorabjee advised Governor Rao on the current political crisis in Tamil Nadu. "Yes, the Governor sought my advice and I gave him mine. however, dropped enough hints that the Governor may take some more time before he takes the next step. "I feel the Governor is well within his rights to defer the swearing-in for a few days particularly when the (verdict in the) disproportionate assets case, involving Sasikala, is imminent," the former Attorney General of India said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X