తమిళనాడులో ఒక్క పైసాకే బంగారం ఉంగరం: జాయ్ ఆలుక్కాస్, కల్యాణ్ జ్యువెలరీస్ కు కాంట్రాక్ట్

ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న తాయిమామన్ తంగ మోతిరం పథకం టెండర్ ప్రక్రియ పూర్తయింది. ప్రముఖ జ్యువెలరీ సంస్థలు జోయ్ ఆలుక్కాస్, కల్యాణ్ జ్యువెలరీస్ ఎంపిక అయ్యాయి. 755 కోట్ల రూపాయల విలువ చేసే టెండర్లు ఇవి. బంగారం ఉంగరాన్ని తయారు చేయడం, రవాణా, ఇతరత్రా ఖర్చులను ఆ సంస్థలే భరించాల్సి ఉంటుంది.

ఈ పథకం కింద తమిళనాడులోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించే సుమారు 4.42 లక్షల మంది నవజాతా శిశువులకు ఒక్కో గ్రాము చొప్పున బంగారు ఉంగరాలను బహూకరిస్తారు. ఈ పథకానికి సంబంధించిన బంగారపు వ్యయాన్ని మార్కెట్ ధరల ఆధారంగా ప్రభుత్వమే భరిస్తుంది. నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలిచేందుకు విజయ్ ఈ పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోన్నారు.

Tamil Nadu Govt Confirms Joyalukkas and Kalyan Jewelers After Matching Lowest Price Gold Ring Scheme

దీనికోసం తమిళనాడు మెడికల్ సర్వీసెస్ జూలై 14న దేశవ్యాప్తంగా టెండర్లను ఆహ్వానించింది. అధికారిక టెండర్ల పోర్టల్ ద్వారా జోయ్ ఆలుక్కాస్, కల్యాణ్ జ్యవెలరీస్, జీఆర్‌టీ జ్యువెలర్స్, ఉమ్మిడి జ్యువెలర్స్ వంటి మొత్తం 11 జ్యువెలరీ సంస్థలు ఈ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొన్నాయి. బిడ్డింగ్ దాఖలు చేశాయి. ఆయా సంస్థల్లో అన్నింటికంటే తక్కువ ధరను కోట్ చేశాయి.. జాయ్ అలుక్కాస్, కల్యాణ్ జ్యువెలర్స్.

ఆనందం పట్టలేక.. నిండు సభలో విజయ్ పై పాట పాడిన మహిళా ఎమ్మెల్యే: సిగ్గుతో మెలికలు తిరిగిన సీఎం
ఆనందం పట్టలేక.. నిండు సభలో విజయ్ పై పాట పాడిన మహిళా ఎమ్మెల్యే: సిగ్గుతో మెలికలు తిరిగిన సీఎం

దీంతో వీటిని ప్రభుత్వం ఎంపిక చేసింది. 70:30 నిష్పత్తిలో బంగారు ఉంగరాల తయారీ, సరఫరా బాధ్యతలను అప్పగిస్తూ పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. జాయ్ ఆలుక్కాస్ అతి తక్కువ బిడ్డింగ్ నమోదు చేసింది. ఒకే ఒక్క పైసా సర్వీస్ ఛార్జీని మాత్రమే కోట్ చేస్తూ ఈ టెండర్‌ను దక్కించుకుంది. బంగారం ధర తప్ప.. ఉంగరం మేకింగ్ ఛార్జీలు, రవాణా, ఇన్సూరెన్స్, హాల్ మార్కింగ్, సర్వీస్ ఛార్జీలు.. అన్నింటికీ కలిపి ఒకే ఒక్క పైసా కోట్ చేసి టెండర్ దక్కించుకుంది జాయ్ అలుక్కాస్.

సీఎం విజయ్ బిగ్ యూటర్న్: ఆ ఆదేశాలు ఇప్పటికప్పుడు వెనక్కి
సీఎం విజయ్ బిగ్ యూటర్న్: ఆ ఆదేశాలు ఇప్పటికప్పుడు వెనక్కి

ఆయా ఖర్చులన్నింటినీ కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి కింద భరిస్తామని వెల్లడించింది. ఈ పథకంలో భాగంగా సుమారు 4,41,667 బంగారు ఉంగరాలను జాయ్ ఆలుక్కాస్, కల్యాణ్ జ్యవెలరీ సంస్థలు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇందులో 22 క్యారెట్ల బంగారాన్ని వినియోగించాలి. దివంగత ముఖ్యమంత్రి అన్నాదురై జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 15వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు విజయ్.

మొదటి విడతలో దాదాపు 1,28,499 బంగారు ఉంగరాలను సరఫరా చేయడానికి జాయ్ అలుక్కాస్, కల్యాణ్ జ్యువెలర్స్ సంస్థకు వర్క్ ఆర్డర్లు అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. బిడ్డ పుట్టిన సందర్భాన్ని కుటుంబసభ్యులతో కలిసి పండుగలా జరుపుకోవడానికి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులను మరింత ప్రోత్సహించడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+