వ్యాఖ్యలు: స్టాలిన్‌పై జయలలిత పరువు నష్టం దావా

జయలలిత తరఫున చెన్నై ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో సిటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎంఎల్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. స్టాలిన్ సహా డిఎంకె శాసనసభ్యులను కొంత మందిని శాసనసభ నుంచి ఈ నెల 22వ తేదీన బయటకు పంపించారు.
ఆ సందర్భంలో స్టాలిన్, మరికొందరు శాసనసభ్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రికి, స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని ప్రాసిక్యూటర్ జగన్ తన పిటిషన్‌లో ఆరోపించారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఆయన చెప్పారు.
సమస్యలపై చర్చించేందుకు ప్రతిపక్ష సభ్యులను అనుమతించడానికి ముఖ్యమంత్రికి, స్పీకర్‌కు, మంత్రులకు ఇష్టం లేదని స్టాలిన్ అన్నట్లు చెబుతున్నారు. డిఎంకె శాసనసభ్యులు సభలో ఉండడం వారికి ఇష్టం లేదని ఆయన అన్నారు. జులై 22వ తేదీన ముఖ్యమంత్రి సభలో లేరని, అయినా కావాలని వ్యాఖ్యలను ముఖ్యమంత్రికి అంటగట్టారని పిటిషన్‌లో అన్నారు.












Click it and Unblock the Notifications