రుణమాఫీ నిధులు విడుదల, వడ్డీ రాయితీపై కీలక ఉత్తర్వులు.
తమిళనాడులో మహిళా సాధికారతకు కొత్త అర్థం చెబుతూ డీఎంకే ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని అమలు చేస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక స్థిరత్వానికి వెన్నెముకగా నిలిచే స్వయం సహాయక బృందాల (SHG) రుణాలను మాఫీ చేస్తూ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు లక్షలాది కుటుంబాల్లో ఆశలు నింపుతోంది. 2021 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు, సహకార బ్యాంకుల ద్వారా మహిళా బృందాలు పొందిన రుణాలను మాఫీ చేస్తూ ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.
గతంలో నెలకొన్న ఆర్థిక సవాళ్లు, కరోనా కష్టాల కారణంగా రుణాలు తీర్చలేక మహిళలు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఈ దుస్థితిని గమనించిన ప్రభుత్వం, 2021 మార్చి 31 నాటికి పెండింగ్‌లో ఉన్న సుమారు 1.01 లక్షల బృందాలకు చెందిన 10.56 లక్షల మంది మహిళల రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. అసలు మరియు వడ్డీతో కలిపి సుమారు రూ.2,674 కోట్ల భారీ మొత్తాన్ని మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భారీ ఊరటతో రుణ విముక్తులైన మహిళలు, ఇప్పుడు కొత్త ఆశలతో తమ చిన్నతరహా వ్యాపారాలను పునఃప్రారంభించేందుకు మార్గం సుగమమైంది.

వడ్డీ రాయితీ నిధుల విడుదల
రుణమాఫీ అమలులో భాగంగా ప్రభుత్వం ఏటా రూ. 600 కోట్లు కేటాయిస్తూ వస్తోంది. అయితే, వడ్డీ నిధుల విడుదలలో ఉన్న జాప్యాన్ని తొలగిస్తూ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 2025 ఏప్రిల్ 30 వరకు ఉన్న 7 శాతం వడ్డీ మొత్తం రూ.193.68 కోట్లను విడుదల చేసింది. దీనికి అదనంగా అసలు మొత్తం రూ.2,118.85 కోట్లను జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల ద్వారా ప్రాథమిక సహకార రుణ సంఘాలకు అందించాలని ఆదేశించింది. ఈ చర్యతో సహకార బ్యాంకుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటమే కాకుండా, వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరిగింది.
కొత్త రుణాలకు పచ్చజెండా..
ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు పూర్తిగా అందడంతో, సహకార బ్యాంకులు ఇప్పుడు కొత్త రుణాలను మంజూరు చేసేందుకు సిద్ధమయ్యాయి. మహిళా బృందాలతో పాటు రైతులు, చిన్నతరహా పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఆటంకం లేకుండా రుణాలు అందిస్తామని బ్యాంకింగ్ అధికారులు స్పష్టం చేశారు. ఇది మహిళల ఆర్థిక స్వయం సమృద్ధికి, సామాజిక అభివృద్ధికి భారీ ఊపునివ్వనుంది.
మరిన్ని హామీల దిశగా..
మహిళా బృందాలకు ఈ తీపి కబురు అందినట్లే, ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన '5 సవర్ల బంగారు రుణాల మాఫీ'పై కూడా ప్రభుత్వం త్వరలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రజలు ఆశిస్తున్నారు. ప్రస్తుత వడ్డీ రాయితీ విడుదల, సహకార రంగంలో మరిన్ని సానుకూల మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది.
-
విజయ్ పార్టీలో సినిమా చిచ్చు! కీలక పార్టీ మద్దతు ఖతం -
విజయ్ విజిల్ రీసౌండ్- పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ గ్రౌండ్ రిపోర్ట్ -
ఎంత సీఎం అయినా.. !! -
Tamil Nadu: రాజకీయాల్లో రీటేక్స్ ఉండవు..! విజయ్ కు చిదంబరం కౌంటర్..! -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం బంపరాఫర్ - తాజా గడువు, మార్గదర్శకాలు..!! -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..!












Click it and Unblock the Notifications