వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: జయ ఆశయాలకు చెక్ ! మోడీకి జై కొట్టిన పన్నీర్ సెల్వం

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తీవ్రంగా వ్యతిరేకించిన ఉజ్వల్ డిస్కామ్ అస్యూరెన్స్ యోజన (ఉదయ్) విద్యుత్ పథకానికి పన్నీర్ సెల్వం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అమ్మ అభిమానులు షాక్ కు గురైనారు.

పలు బుజ్జగింపులు, తర్జనభర్జనలు, బెదిరింపుల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఉదయ్ పథకంలోకి అడుగు పెట్టంది. ఈమేరకు ఢిల్లీలో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి తంగమణి సమక్షంలో విద్యుత్ బోర్డు ఉన్నతాధికారులు ఒప్పంద ప్రతాలపై సంతకాలు చేశారు.

<strong>జయలలిత మేనకోడలు దీపా కొత్త పార్టీ: పురట్చిమలర్</strong>జయలలిత మేనకోడలు దీపా కొత్త పార్టీ: పురట్చిమలర్

కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉదయ్ విద్యుత్ పథకాన్ని ప్రవేశ పెట్టంది. ఈ పథకాన్ని అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ పథకాన్ని అంగీకరిస్తే విద్యుత్ బోర్డు నష్టాలకు గురౌతుందని, ఫెడరల్ రాజ్యాంగానికి చేటు కలిగిస్తుందని జయలలిత విమర్శించారు.

Tamil Nadu has decided to join the Centre's Ujwal DISCOM Assurance Yojana (UDAY) scheme.

దేశంలోని 20 రాష్ట్రాలు ఉదయ్ విద్యుత్ పథకంలో చేరినా మా ప్రభుత్వం మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఈ పథకంలో చేరే ప్రసక్తే లేదని జయలలిత తేల్చి చెప్పారు. అయితే జయలలిత మరణించిన తరువాత పాలనా పగ్గాలు చేపట్టిన పన్నీర్ సెల్వం ప్రభుత్వం ఉదయ్ విద్యుత్ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

<strong>నెచ్చెలి శశికళ బహిష్కరణ ! అన్నాడీఎంకే లీడర్స్</strong>నెచ్చెలి శశికళ బహిష్కరణ ! అన్నాడీఎంకే లీడర్స్

ఉదయ్ విద్యుత్ పథకంలో చేరిన ప్రతి రాష్ట్రం రోజుకు 24 గంటల పాటు నిరాటంకంగా విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుంది. దెబ్బతిన్న విద్యుత్ సంస్థలను సక్రమ పరచాల్సి ఉంటుంది. విద్యుత్ ఉత్పత్తిలో ప్రైవేట్ సంస్థలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.

మూడుమాసాలకో సారి విద్యుత్ చార్జీలపై సమీక్షలు జరపాలి. మీటర్లు లేకుండా విద్యుత్ సరఫరా చేసే అవకాశం ఉండదు. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ పథకాలు రద్దు అవుతాయి. విద్యుత్ వినియోగాన్ని కంప్యూటరీకరణ చెయ్యాలి.

<strong>అన్నాడీఎంకేలో అసమ్మతి చిచ్చు: దొరైస్వామి, మాజీ స్పీకర్ దెబ్బ</strong>అన్నాడీఎంకేలో అసమ్మతి చిచ్చు: దొరైస్వామి, మాజీ స్పీకర్ దెబ్బ

విద్యుత్ బోర్డుకు చెందిన 75 శాతం రుణాలను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. అయితే ఉదయ్ విద్యుత్ పథకంలో తమిళనాడు ప్రభుత్వం చేరడంతో ఆ రాష్ట్రానికి మరో లక్ష కోట్ల రుపాయల రుణభారం పెరుగుతుందని, మూడు మాసాలకు ఓ సారి విద్యుత్ చార్జీలు పెరుగుతాయని, అందుకే జయలలిత అప్పట్లో ఈ పథకాన్ని వ్యతిరేకించారని సమాచారం.

English summary
Tamil Nadu has decided to join the Centre's Ujwal DISCOM Assurance Yojana (UDAY) scheme, which is meant to revive the debt stressed discoms in the county. Tamil Nadu will be the 21st state to join the scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X