చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జల్లికట్టు కాదు, దమ్ముంటే ఇవి బ్యాన్ చెయ్యండి: కమల్ హాసన్

ఏవో దారుణాలు జరిగిపోతాయని ఆరోపిస్తూ జల్లికట్టు సాహస క్రీడను నిషేధించడం సరైంది కాదని, ప్రతిరోజూ వందల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయని, అయితే ఎన్ని రాష్ట్రాల్లో కారు,

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఏవో దారుణాలు జరిగిపోతాయని ఆరోపిస్తూ జల్లికట్టు సాహస క్రీడను నిషేధించడం సరైంది కాదని ప్రముఖ నటుడు కమల్ హాసన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తమిళనాడు సాంప్రదాయాలను, ఇక్కడి ప్రజలను గౌరవించాలని ఆయన మనవి చేశారు.

షాకింగ్ వీడియో ట్వీట్ చేసిన కమల్ హాసన్, పోలీసులే ఇలా, ఛీ !

మంగళవారం చెన్నైలో కమల్ హాసన్ మీడియాతో మాట్లాడారు. ఎద్దులను హింసిస్తున్నారని, ఎద్దులు పొడవడంతో యువకులు మరణిస్తున్నారని ఆరోపిస్తూ జల్లికట్టును అడ్డుకోవడానికి ప్రయత్నించడం దారుణంగా ఉందని అన్నారు.

రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని మనకు అందరికీ తెలుసు అని కమల్ హాసన్ గుర్తు చేశారు. అయితే కారు, బైక్ రేసులు నిషేధించారా ? అని ఆయన ప్రశ్నించారు. ప్రతిరోజూ వందల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి, ఆ విషయం మీకందరికీ తెలుసుకదా అని కమల్ హాసన్ మీడియాతో అన్నారు.

అయితే ఎన్ని రాష్ట్రాల్లో కారు, బైక్ రేసులు నిషేధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. జల్లికట్టుపై అభ్యంతరాలు చెప్పడం కాదని, ప్రమాదాలకు కారణం అయ్యే కారు, బైక్ రేసులు నిషేధించాలని కమల్ హాసన్ డిమాండ్ చేశారు.

పన్నీర్ సెల్వంకు ఇలా చెక్ పెట్టారు: పక్కా ప్లాన్ తో సీఎం పోస్టు ఔట్ !

మంగళవారం ఉదయం ట్వీట్ చేసిన వీడియోలో ఉన్న పోలీసు గురించి ఆయన స్పందించారు. ఎవరో వ్యక్తి పోలీసు దుస్తుల్లో వచ్చి ఆటోకు నిప్పంటించి ఉంటే సంతోషిస్తానని, అయితే ఆయన నిజంగా పోలీసు అయితే మాత్రం ఆ విషయాన్ని వ్యతిరేకిస్తానని కమల్ హాసన్ అన్నారు.

పేటాను నిషేధించడం కంటే ఆ సంస్థ మీద ఆంక్షలు పెట్టడం మంచిదని కమల్ హాసన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. జల్లికట్టు కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులను, ప్రజలను తాను అభినందిస్తానని కమల్ హాసన్ చెప్పారు.

English summary
I shocked after see video of cop committing arson, hope some sort of explanation is given to us so that we can calm down, says Kamal Haasan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X