లైంగిక వేధింపులు: ఎంపీ శశికళ పుష్పపై కేసు

తూత్తుకూడి (తమిళనాడు): అన్నాడీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆగ్రహానికి గురై పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎంపీ శశికళ పుష్ప, ఆమె కుటుంబ సభ్యుల మీద లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.

శశికళ పుష్ప ఇంట్లో పని చేస్తున్న 22 సంవత్సరాల యువతి కేసు పెట్టిందని పోలీసులు తెలిపారు. శశికళ భర్త లింగేశ్వర్ తిలకన్, ఆమె కుమారుడు ప్రదీప్ రాజా తనతో పాటు తన సోదరిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేసింది.

తిరునల్వేలి జిల్లాలోని అనైకుడి ప్రాంతానికి చెందిన బాధితురాళ్లు చెన్నైలోని ఎంపీ శశికళ పుష్ప ఇంట్లో పని చేసేవారు. లైంగిక దాడులు ఎక్కువ కావడంతో గత సంవత్సరం తాము పారిపోయేందుకు ప్రయత్నించామని బాధితురాలు పోలీసులకు చెప్పింది.

Tamil Nadu: Maid alleges torture by MP Sasikala Pushpa

తరువాత శశికళ, ఆమె తల్లి తమను పలు సార్లు కొట్టారని చెప్పారు. తెల్లకాగితం మీద మా దగ్గర సంతకాలు చేయించుకున్నారని, ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారని పోలీసులకు చెప్పారు.

అంతే కాకుండ తమను ఇంట్లో నిర్భంధించి చిత్రహింసలు పెట్టారని బాధితులు చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో సొంత పార్టీ ఎంపీని చెంపదెబ్బ కొట్టడంతో శశికళ పుష్పను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+