Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాసేపట్లో సీఎం ఇల్లు,సెక్రటేరియట్ స్మాష్.. అంటూ ఫోన్‌కాల్‌, పోలీసులు అలెర్ట్.. అసలేం జరిగిందంటే..

అప్పుడు టైమ్ సరిగ్గా ఉదయం 9:40.. పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చింది.. ''హలో.. నేను చెప్పేది శ్రద్ధగా వినండి.. ఇంకాసేపట్లో ముఖ్యమంత్రి అధికార నివాసం, సెక్రటేరియట్ భవనం నేలమట్టం కానున్నాయి.. ఆ రెండు చోట్లా శక్తిమంతమైన బాంబులు పెట్టాను.. నేను ఎవరేది మీకు అనవసరం.. దమ్ముంటే అందర్నీ కాపాడుకోండి''.. ఇటు నుంచి పోలీసులు స్పందించేలోపే అవతలి వ్యక్తి ఫోన్ కట్ చేశాడు. సీన్ కట్ చేస్తే..

బాంబ్, డాగ్‌స్క్వాడ్స్..

బాంబ్, డాగ్‌స్క్వాడ్స్..

బెదిరింపు కాల్ వ్యవహారం తమిళనాడు రాజధాని చెన్నైలో మంగళవారం కలకలం రేపింది. ఫోన్ కాల్ కట్ అయిన మరుక్షణమే పోలీసులు అలెర్ట్ అయ్యారు. చెన్నై రోడ్డులో ఉన్న ముఖ్యమంత్రి పళనిస్వామి ఇల్లు, మెరీనా బీచ్ సమీపంలోని సెక్రటేరియట్ భవంతి దగ్గర సెక్యూరిటీ టైట్ చేశారు. వెంటనే బాంబ్, డాగ్‌స్క్వాడ్‌లను రంగంలోకి దించి, అణువణువూ వెతికారు. ఆ రెండు భవంతులకు దారి తీసే మార్గాలన్నింటినీ ఆధీనంలోకి తీసుకుని చెకింగ్స్ చేపట్టారు.

ఫేక్ బెదిరింపుగా నిర్ధారణ..

ఫేక్ బెదిరింపుగా నిర్ధారణ..

గంటలపాటు సోదాలు నిర్వహించినా బాంబు జాడ దొరక్కపోవడంతో అది ఫేక్ బెదిరింపు కాల్ గా పోలీసులు నిర్ధారించుకున్నారు. సదరు ఫోన్ కాల్ విల్లుపురం నుంచి వచ్చినట్లుగా తేలడంతో.. ఆ వ్యక్తిని పట్టుకునేందుకు స్పెషల్ టీమ్ లను రంగంలోకి దింపినట్లు అధికారులు తెలిపారు. జాగ్రత్త చర్యల్లో భాగంగా సీఎం నివాసం, సెక్రటేరియట్ దగ్గర గట్టి నిఘా ఏర్పాటుచేశామని, డ్రోన్ కెమెరాలతో సైతం పర్యావేక్షిస్తున్నామని వెల్లడించారు. బహుశా మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయిన వ్యక్తే ఈ దుశ్చర్యకు పాల్పడిఉండొచ్చని అనుమానిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

మూడు నెల్లో రెండోసారి..

మూడు నెల్లో రెండోసారి..

తమిళనాడు సీఎం ఎడిప్పాడి పళనిస్వామి ఇంట్లో బాంబు ఉందంటూ నకిలీ బెదిరింపు కాల్స్ రావడం మూడు నెలల వ్యవధిలో ఇది రెండోసారి. మంగళవారం జరిగినట్లే.. మార్చి 17న కూడా చెన్నై సిటీకే చెందిన సుందర్ రాజ్ అనే వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. గంటల వ్యవధిలోనే పోలీసులు అతణ్ని ట్రాక్ చేశారు. అయితే అతను మానసిక రోగి అని తెలియడంతో ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే కరోనా మహమ్మారి ధాటికి విలవిలలాడుతోన్న తమిళనాడులో బాంబు బెదిరింపు కలకలం రేపింది.

తగ్గని వ్యాప్తి.. అయినా సడలింపులు..

తగ్గని వ్యాప్తి.. అయినా సడలింపులు..

దేశంలో కరోనా విలయానికి తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర తర్వాతి స్థానం తమిళనాడుదే. మంగళవారం ఒక్కరోజే వెయ్యికిపైగా కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 25వేలకు చేరువైంది. రాష్ట్రంలో కరోనా కాటుకు 200 మంది బలైపోగా, 10వేల పైచిలుకు యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. వైరస్ వ్యాప్తి ఇంకా కంట్రోల్ లోకి రాకపోయినా పళని సర్కారు భారీగా సడలింపులు ప్రకటించింది. ఇప్పటికే బస్సు సర్వీసులు సైతం ప్రారంభం కాగా, జూన్ 11 నుంచి బోర్డు పరీక్షలు సైతం నిర్వహించేందుకు ఆదేశాలు వెలువడ్డాయి.

ఇవీ తాజా లెక్కలు..

ఇవీ తాజా లెక్కలు..


సడలింపుల తర్వాత తమిళనాడులో కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ బుధవారం తాజాగా వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1286 పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 25,872కు, మరణాలు 211కు పెరిగినట్లయింది. మరో 610 మంది వ్యాధి నుంచి కోలుకోగా, డిశ్చార్జి అయినవాళ్ల సంఖ్య14,316గా ఉంది. ప్రస్తుతం 11,345 యాక్టివ్ కేసులకు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. పొందుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+