హిందీ vs తమిళం: మళ్లీ చిచ్చు పెట్టిన మంత్రి వ్యాఖ్యలు
Tamil Nadu: తమిళనాడులో భాషా యుద్ధం మరోసారి ముదిరింది. హిందీ భాషా వినియోగం, వలస కార్మికులపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ఎంఆర్కే పన్నీర్‌సెల్వం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను వివాదానికి దారితీశాయి. ఉత్తరాది నుంచి వచ్చే వారు కేవలం తక్కువ స్థాయి పనులకే పరిమితమవుతున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు భగ్గుమంటున్నాయి.
మంత్రి అసలేం అన్నారంటే?
ఓ బహిరంగ కార్యక్రమంలో మంత్రి పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ.. కేవలం హిందీ మాత్రమే నేర్చుకున్న ఉత్తరాది వారికి ఉపాధి అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. "ఉత్తరాది నుంచి వచ్చే వారు ఇక్కడ కేవలం హోటళ్లలో టేబుళ్లు శుభ్రం చేయడం, నిర్మాణ రంగంలో కూలీలుగా పనిచేయడం లేదా పానీపూరీలు అమ్ముకోవడం వంటి పనులు మాత్రమే చేస్తున్నారు. వారికి ఇతర నైపుణ్యాలు లేకపోవడమే ఇందుకు కారణం" అని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి భిన్నంగా తమిళనాడు విద్యార్థులు తమిళంతో పాటు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవడం వల్ల అమెరికా, లండన్ వంటి దేశాల్లో కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని ఆయన పోల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రెండు భాషల విధానం వల్లే ఇది సాధ్యమవుతోందని ఆయన చెప్పుకొచ్చారు.

విపక్షాల ఆగ్రహం.. తీవ్రంగా స్పందించిన బీజేపీ
మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఇది ఉత్తరాది వారిని కించపరచడమేనని, డీఎంకే ప్రభుత్వం ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతోందని విమర్శించింది. తమిళనాడు ఆర్థిక వ్యవస్థ వలస కార్మికులపై ఆధారపడి ఉందని, ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం సరికాదని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ, జేడీయూ వంటి పార్టీలు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించాయి. ఉత్తర భారతీయులు దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశాయి.
At a party event in Chengalpattu, DMK Minister Shri @MRKPanneer mocked North Indian migrants as “table cleaners and pani puri sellers.” No job is small and no Indian is inferior.
— Dr. Arvind Menon (@MenonArvindBJP) February 4, 2026
This reflects a troubling pattern of DMK leaders targeting migrant workers, especially North Indians… pic.twitter.com/LaYg5DRIB9
డీఎంకే డ్యామేజ్ కంట్రోల్
వివాదం ముదరడంతో అధికార డీఎంకే పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మంత్రి ఉద్దేశం ఎవరినీ అవమానించడం కాదని.. కేవలం ఇంగ్లీష్ విద్య వల్ల కలిగే ప్రయోజనాలను వివరించడమేనని పార్టీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రతి పనికి దాని గౌరవం ఉంటుందని, హిందీ మాట్లాడే వారి పట్ల తమకు ఎలాంటి ద్వేషం లేదని వివరణ ఇచ్చారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications