విద్యాసాగర్‌కు రాజ్‌నాథ్ ఫోన్, అభిమానుల్లో ఆందోళన, తమిళనాడులో హైఅలర్ట్
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం రాత్రి తమిళనాడు ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావుకు ఫోన్ చేసి తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్యం గురించి వాకబు చేశారు.
చెన్నై: కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం రాత్రి తమిళనాడు ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావుకు ఫోన్ చేసి తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్యం గురించి వాకబు చేశారు.
జయలలితకు గుండెపోటు వచ్చినట్లు అపోలో ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యాసాగర రావు హుటాహుటిన ముంబై నుంచి చెన్నై బయలుదేరారు.

అమ్మకు గుండె జబ్బు రావడంతో అన్నాడీఎంకే నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. జయలలిత అనారోగ్య పరిస్థితి తెలిసి మంత్రులు, కార్యకర్తలు, అభిమానులు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్నారు.
జయలలితను ఐసీయులో ఉంచి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. కార్డియాలజిస్టుల పర్యవేక్షణలో ఉన్నారు. హృద్రోగ, శ్వాసకోశ నిపుణులు జయలలిత ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
రెండున్నర నెలలుగా ఆమె ఆసుపత్రిలోనే ఉంటున్నారు. అమ్మకు గుండెపోటు వచ్చిన విషయం తెలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్లో ఆందోళన కనిపిస్తోంది. అన్ని పోలీస్ స్టేషన్లు అలర్ట్‌గా ఉండాలని ప్రకటించడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
తమిళనాడు వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. అమ్మ చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రి బయట పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఉంది. ఆర్మ్‌డ్ రిజర్వ్, తమిళనాడు ప్రత్యేక పోలీసులు.. ఇలా అందరినీ ముందుజాగ్రత్త చర్యగా దించారు. సమీక్ష కోసం మధురై వెళ్లిన డిజిపి టీకే రాజేందర్ కూడా హుటాహుటిన చెన్నై బయలుదేరారు.












Click it and Unblock the Notifications