కమల్ హాసన్ కు మరో చిక్కు: కోర్టులో పిల్, హిందువులను!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: బహుబాష నటుడు, నిర్మాత, దర్శకుడు కమల్ హాసన్ పై కేసుల పరంపర కొనసాగుతోంది. ఆయన మీద హిందూ మతాన్ని అవమానించారని ఆరోపిస్తూ హిందూ మక్కల్ కట్చి (హెచ్ఎంకే) కోర్టులో పిల్ దాఖలు చేసింది.

కమల్ హాసన్ బహిరంగంగా హిందూ మతాన్ని అవమానించారని ఆరోపిస్తూ తిరునల్వేలి జిల్లా కోర్టులో పిల్ (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) దాఖలు చేశారు. ఇటీవల కమల్ హాసన్ ఓ టీవీ చానల్ కు ఇంటర్వూ ఇస్తూ మహాభారతంలోని పాత్ర గురించి వివరించారు.

మహాభారతంలోని పాత్ర గురించి కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యను హిందూ మక్కల్ కట్చి ఖండించింది. కమల్ హాసన్ మీద ఈనెల 15వ తేదీని చెన్నై నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసి ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ మక్కల్ కట్చి మనవి చేసింది.

Tamil Nadu: PIL filed against Kamal Haasan for alleged derogatory remarks on Hindus

జయలలిత మరణించిన తరువాత తమిళనాడులో ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై కమల్ హాసన్ తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అన్నాడీఎంకే పార్టీలో అధికారం కోసం జరిగిన కుమ్ములాటపై కమల్ హాసన్ ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం సరైన వ్యక్తి అంటూ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు కమల్ హాసన్ మీద కేసుల పరంపర కొనసాగుతోంది కావాలనే మా అభిమాన నటుడి మీద బురదచల్లడానికి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని కమల్ అభిమానులు మండిపడుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Public Interest Litigation (PIL) has been filed against actor Kamal Haasan in the Tirunelveli District Court by the members of the Hindu Makkal Katchi for his alleged derogatory remarks on Hindus.
Please Wait while comments are loading...