Tamil Nadu Polls: పళనిస్వామికి ఘోర అవమానం ..! దిగిపొమ్మన్న మోడీ..!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు (Tamil Nadu Assembly Election 2026) మరో వారం రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఇప్పటికే బీజేపీ అంటేనే మండిపడే తమిళ పార్టీలకు ఎన్నికల వేళ మరో అస్త్రం దొరికింది. ప్రధాని మోడీ తమ మిత్రపక్షమైన అన్నాడీఎంకే అధినేత పళని స్వామితో కలిసి తాజాగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓ వాహనంపైకి ఎక్కి మోడీ, పళనిస్వామి ఇద్దరూ ప్రచారం చేశారు. ఆ తర్వాత పళనిస్వామికి ప్రధాని మోడీ షాకిచ్చారు.

Tamil Nadu: తమిళనాట నిరసనలకు స్టాలిన్ పిలుపు..! నిప్పుతో ఆడుకోవద్దని వార్నింగ్..!
Tamil Nadu: తమిళనాట నిరసనలకు స్టాలిన్ పిలుపు..! నిప్పుతో ఆడుకోవద్దని వార్నింగ్..!

ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) కుమరిలో నిర్వహించిన రోడ్‌షోకు ప్రజలు, కార్యకర్తలు పూలతో ఘన స్వాగతం పలికారు. రోడ్‌షో ముగిసిన తర్వాత వాహనం దిగే సమయంలో, పక్కకు తిరిగి నిలబడి ఉన్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామిని (Edappadi Palaniswami) ప్రధాని మోడీ.. కిందకు 'దిగండి' అంటూ మీద చేయి వేసి మరీ దింపేశారు. దీంతో ఈ దృశ్యాలు తమిళ మీడియాలో వైరల్ అయ్యాయి.

Tamil Nadu Polls Enough Sir Get Down Modi s Nudge to Palaniswami
స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ?
స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ?

వేపమూడు జంక్షన్ నుండి వడసేరి అన్నా విగ్రహం వరకు సుమారు 1.5 కిలోమీటర్ల దూరం సాగిన ప్రధాని రోడ్‌షోకు ఇరువైపులా ప్రజలు, కార్యకర్తలు బారులు తీరారు. విజయవంతంగా రోడ్‌షో ముగిసిన తర్వాత, వడసేరి అన్నా విగ్రహం వద్ద వాహనం నుండి దిగిన ప్రధాని మోడీ.. అన్నా, ఎం.జి.ఆర్. విగ్రహాలకు, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ క్రమంలో ప్రచార వాహనం నుంచి అందరూ కిందకు దిగేందుకు సిద్ధమయ్యారు. అనంతరం మోడీ వెనుక నిలబడిన అన్నామలై, పొన్ రాధాకృష్ణన్ కిందకు దిగారు. కానీ ప్రధాని మోడీ పక్కనే ఉన్న ఎడప్పాడి పళనిస్వామి, నైనార్ నాగేంద్రన్ ముందు నిలబడిన కార్యకర్తలకు అభివాదం చేస్తూనే ఉన్నారు. ఆ సమయంలో ప్రధాని మోడీ ఎడప్పాడి పళనిస్వామిని టచ్ చేస్తూ... 'చాలు, చాలు దిగండి' అంటూ వారించారు. దీంతో ఎడప్పాడి పళనిస్వామి కిందకు దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+