Tamil Nadu: తమిళనాట నిరసనలకు స్టాలిన్ పిలుపు..! నిప్పుతో ఆడుకోవద్దని వార్నింగ్..!
కేంద్రం చేపడుతున్న నియోజకవర్గాల పునర్విభజన, లోక్ సభ సీట్ల పెంపు వ్యవహారం తమిళనాడు (tamil nadu)లో తీవ్ర చిచ్చు రేపుతోంది. ఓవైపు ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్రం పార్లమెంట్ లో బిల్లు పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలపై తమిళులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నల్ల జెండాలు ఎగరవేసి నిరసనలు చేపట్టాలని సీఎం ఎంకే స్టాలిన్ (mk stalin) పిలుపునిచ్చారు. తమిళనాడు పోరాడుతుంది! తమిళనాడు గెలుస్తుంది! అంటూ ఆయన ఇవాళ ఓ ట్వీట్ చేశారు.
భారతదేశ అభివృద్ధి కోసం కృషి చేసిన నేరానికి తమిళనాడు, దక్షిణ రాష్ట్రాలకు శిక్ష విధిస్తున్నారా? అని స్టాలిన్ కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం రేపు పార్లమెంటులో ప్రవేశపెట్టాలని యోచిస్తున్న #డీలిమిటేషన్ సవరణ బిల్లు, తమిళనాడు, దక్షిణ రాష్ట్రాలపై రుద్దబడిన ఒక "భారీ చారిత్రక అన్యాయం"! అన్నారు. వింధ్య పర్వతాలకు దక్షిణాన ఉన్న ప్రతి దక్షిణాదివాసి తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాడని, బీజేపీ నిప్పుతో ఆడుకుంటోందని స్టాలిన్ తెలిపారు.

రేపు, డీలిమిటేషన్‌కు నిరసనగా తమిళనాడు వ్యాప్తంగా ఇళ్లపైనా, బహిరంగ ప్రదేశాలపైనా నల్ల జెండాలు ఎగురవేస్తారని,
కేంద్ర ప్రభుత్వం తమిళనాడు వాణిని విని, బిల్లును వెనక్కి తీసుకోడానికి నిరాకరిస్తే, మీరు పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. దీనికి మీరు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. డీఎంకే అధ్యక్షుడిగా, అన్నింటికంటే ముఖ్యంగా ఆత్మగౌరవం గల తమిళుడిగా హెచ్చరిస్తున్నట్లు స్టాలిన్ తెలిపారు.












Click it and Unblock the Notifications