ఆయనకే ఓటేశా.. మీరూ వేస్తే సీఎం ఖాయం-వీటీవీ గణేష్ షాకింగ్..!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు ఓటర్లు భారీ ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇందులో రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు సినీ నటులు, ఇతర సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అయితే ఇవాళ తమిళనాడు ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు, సినీ నటుల్లో చాలా మంది తాము ఎవరికి ఓటు వేశామో తెలిసే విధంగా పరోక్ష సంకేతాలు ఇస్తున్నారు. అయితే నటుడు వీటీవీ గణేష్ (VTV Ganesh) మాత్రం బహిరంగంగానే తాను ఎవరికి ఓటేశారో చెప్పేశారు.
జైలర్ తో పాటు పలు తెలుగు సినిమాల్లో కమెడియన్ పాత్రలు పోషించిన వీటీవీ గణేష్ ఇవాళ పోలింగ్ కేంద్రంలో ఓటేసి బయటికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. తాను టివికెకి ఓటు వేశానని, సమాజాన్ని, ప్రజలను, వ్యవస్థను ఉన్నతీకరించడానికి విజయ్ సరైన వ్యక్తి అని గణేష్ తెలిపారు. ఆయన ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకుంటున్నట్లు గణేష్ వెల్లడించారు. అలాగే యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

#WATCH | Tamil Nadu Elections 2026 | Actor VTV Ganesh says, "I cast my vote to TVK. Vijay is a perfect fit to upgrade the society, people and the system... I want him to become the CM..."
— ANI (@ANI) April 23, 2026
He also says, "Young voters should exercise their voting rights..." pic.twitter.com/RWJ5mc5ydS
వాస్తవానికి ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటర్లు తాము ఎవరికి ఓటేశారో వెల్లడించడం నిషేధం. కానీ వీటీవీ గణేష్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా తాను విజయ్ టీవీకేకే ఓటు వేశానని చెప్పడం, యువత అంతా ఓటేసి విజయ్ ను ముఖ్యమంత్రి చేసుకోవాలన్నట్లుగా వ్యాఖ్యలు చేయడం విశేషం. రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్య జరుగుతున్న ముఖాముఖీ పోరులో విజయ్ కింగ్ మేకర్ గా నిలుస్తారన్న వార్తల నేపథ్యంలో వీటీవీ గణేష్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications