తమిళనాడు, బెంగాల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు ఈసీ బిగ్ షాక్..!
తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో రేపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. తమిళనాడులో ఏకైక దశ పోలింగ్, అలాగే బెంగాల్లో తొలి దశ పోలింగ్ రేపు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సంఘం షాకిచ్చింది. ప్రధాని మోడీని తీవ్రవాదిగా పేర్కొంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) తమిళనాడు ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ ఈసీ నోటీసులు పంపింది.
ప్రధాని మోడీని అవమానించారన్న ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు నోటీసు జారీ చేసింది. ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో ఒక పత్రికా సమావేశంలో ప్రధాని మోదీని ఖర్గే 'ఉగ్రవాది' అని పిలిచారన్న ఆరోపణలు వచ్చాయి. తమిళనాడులో ఏఐఏడీఎంకేపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఆయన.. వారు (ఏఐఏడీఎంకే) మోదీతో ఎలా జట్టు కడతారు ? ఆయన ఒక ఉగ్రవాది, ఆయన సమానత్వాన్ని నమ్మడు, ఆయన పార్టీ సమానత్వాన్ని, న్యాయాన్ని నమ్మదు, ఈ ప్రజలు వారితో కలుస్తున్నారు, అంటే వారు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని అర్థం అన్నారు.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికల నియమావవళి ఉల్లంఘించారంటూ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీనిపైై స్పందించిన ఈసీ.. ఇవాళ ఖర్గే వివరణ కోరుతూ నోటీసులు పంపింది. ఇప్పటికే ఖర్గే తన వ్యాఖ్యలపై స్పందించారు. ప్రధాని మోదీ కేంద్ర సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను భయపెడుతున్నారని సూచించేందుకే తాను ఆ వ్యాఖ్య చేశానని ఖర్గే వెంటనే స్పష్టం చేశారు. కేంద్ర సంస్థలు అధికార బీజేపీతో కుమ్మక్కయ్యాయని ఆయన ఆరోపించారు. అయినా ఈసీ వివరణ కోరుతూ నోటీసులు పంపింది.












Click it and Unblock the Notifications