తమిళనాడు: రూ. 570 కోట్లపై తేల్చని ఈసీ
కోయంబత్తూరు: తమిళనాడులో శాసన సభ ఎన్నికలకు ముందు పట్టుబడిన రూ. 570 కోట్ల నగదుపై ఎన్నికల సంఘం అధికారులు విచారణ జరుపుతున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును కోయంబత్తూరుకు తరలించారు. ఆర్ బీఐ, ఐటీ, ఎస్ బీఐ బ్యాంకు అధికారులను ఎన్నికల సంఘం అధికారులు విచారిస్తున్నారు.
కంటేనర్లలో డబ్బులు తరలిస్తున్న సమయంలో తమిళనాడులోని తిరువూరు జిల్లా పెరుమనలూరు-కునత్తూరు బైపాస్ రోడ్డులో నాకాబందీ చేస్తున్న ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. ఎన్నికల అధికారులు ఈ డబ్బును సీజ్ చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలించారు.

తరువాత ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం ఎస్ బీఐ, ఎస్ సీఏ బ్రాంచ్ అధికారులు ఈ నగదు తమదేనని ఎన్నికల అధికారులకు చెప్పారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి ఈ నగదు విశాఖపట్నం తెప్పిస్తున్నామని వివరించారు. అయితే ఎన్నికల అధికారులు మాత్రం ఈ నగదును బ్యాంకు అధికారులకు అప్పగించలేదు. పూర్తి స్థాయి విచారణ జరిగిన తరువాత నగదు అప్పగించే విషయం ఆలోచిస్తామని ఎన్నికల అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications