జీతాల కోసం ఉపాధ్యాయల ఆందోళన: విద్యార్థులకు పాఠాలు చెప్పిన సేలం కలెక్టర్ రోహిణి !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: జీతాలు పెంచాలని, వివిధ డిమాండ్లు పరిష్కారం కోసం తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయలు ఆందోళన చేపట్టారు. తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

షాక్: పుదుచ్చేరి రిసార్ట్ నుంచి అన్నాడీఎంకే ఎమ్మెల్యే జంప్, నో కామంట్, మన్నార్ గుడి !

 Tamil Nadu Salem Collector Rohini today acts as teacher

అనేక ప్రభుత్వ పాఠశాలలకు గురువారం నుంచి తాళాలు వేశారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఆందోళనకు దిగడంతో ప్రభుత్వ కార్యాలయాలు బోసిపోయాయి. వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలాయాలకు వెళ్లి అసహనంతో వెనుతిరుగుతున్నారు.

సేలంలో మాత్రం ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు పాఠాలు వింటున్నారు. అక్కడ పాఠాలు చెబుతున్నది ఉపాధ్యాయులు మాత్రం కాదు. సేలం జిల్లా కలెక్టర్ రోహిణి. సేలంలో ప్రభుత్వ పాఠశాలలో జిల్లా కలెక్టర్ రోహిణి పాఠాలు చెబుతున్నారు.

 Tamil Nadu Salem Collector Rohini today acts as teacher

నడి రోడ్డులో ఏసీపీ కామపిచ్చి: మహిళా ఎస్ఐ మీద చెయ్యి ఎక్కడ వేశాడంటే (వీడియో)

ఉపాధ్యాయులు లేకపోయినా విద్యార్థులు చక్కగా పాఠాలు వింటున్నారు. ఉపాధ్యాయులు లేనిలోటును తీర్చి విద్యార్థులకు పాఠాలు చెబుతూ మరో వైపు ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్న జిల్లా కలెక్టర్ రోహిణిని తమిళనాడు ప్రభుత్వంతో పాటు ప్రజలు అభినందిస్తున్నారు జిల్లా కలెక్టర్ రోహిణి ఇప్పుడు తమిళనాడులో హాట్ టాఫిక్ అయ్యారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
As government school teachers staged protest for demanding salary hike, Salem Collector Rohini teaches in a government school.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి