ఘోర రైలు ప్రమాదానికి అదే కారణమా?: లోకో పైలట్ ఏమన్నారంటే?
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని కవరపేటై స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి మైసూరు-దర్భంగా బాగ్‌మతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలపై నిలిచిపోయిన గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో రెండు బోగీలు నుంచి మంటలు చెలరేగాయి. మరో 12 బోగీలు పట్టాలు తప్పినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ.. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, శుక్రవారం రాత్రి 8.27 గంటల సమయంలో పొన్నేరి స్టేషన్ దాటిన రైలుకు కవరైప్పెట్టై స్టేషన్‌లో మెయిన్ లైన్‌లో వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ, ఆ స్టేషన్‌లోకి ప్రవేశిస్తున్న సమయంలో భారీ కుదుపు ఏర్పడినట్లు రైలు లోకో పైలట్ గుర్తించారు. అనంతరం మెయిన్ లైన్‌లో వెళ్లాల్సిన రైలు.. లూప్‌లోన్‌లో వెళ్లి అక్కడ ఆగివున్న గూడ్స్ రైలును బలంగా ఢీకొట్టినట్లు తెలిపారు. ప్రమాదానికి ఇదే కారణమని పేర్కొన్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. అంబులెన్స్ లు, రెస్క్యూ వాహనాలను అందుబాటులో ఉంచారు. ప్రయాణికులను సురక్షితంగా తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేశారు. తాగునీరు అందించారు. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీశారు. గాయపడిన ప్రయాణికులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
तमिलनाडु के तिरुवल्लुर में बागमती सुपरफास्ट एक्सप्रेस की मालगाड़ी से हुई दुर्घटना बेहद दुर्भाग्यपूर्ण है। इस हादसे में 3 कोच पूरी तरह क्षतिग्रस्त हो गए है, जिसमें कई लोगों के गंभीर रूप से घायल होने की सूचना है। अश्विनी वैष्णव के तत्काल इस्तीफे की मांग करता हूं। #TrainAccident pic.twitter.com/hgcPDHpZ69
— Hansraj Meena (@HansrajMeena) October 11, 2024
చెన్నై రైల్వే డివిజన్ అధికారులు ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. అవసరమైన సమాచారం కోసం 04425354151, 04424354995 నెంబర్లను సంప్రదించవచ్చు.
#WATCH | Six coaches of Train No.12578 (MYS-DBG) Mysore to Darbhanga were derailed after it collided with a goods train at around 20.30 hours. No causalities were reported. A few people were injured. The medical relief van and rescue team have started to move from Chennai… https://t.co/X9nIQ6uk3U pic.twitter.com/LPqfeXsF68
— ANI (@ANI) October 11, 2024
కాగా, రైలు ప్రమాదం కారణంగా పలు రైళ్లు రద్దవగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. నెల్లూరు రైల్వే స్టేషన్ లో 2 గంటల నుంచి బొకారో ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. ధనాబాద్ - అల్పూజా ఎక్స్‌ప్రెస్ (13351) రైలుని రేణిగుంట- మెల్పక్కమ్- కట్‌పాడి మీదుగా మళ్లించారు. నాయుడుపేట, సుళ్లూుపేట, చెన్నై సెంట్రల్, అరక్కోణం స్టేషన్లో రైలు ఆగదు. మరోవైపు, జబల్పూర్ - మధురై (02122) రైలుని రేణిగుంట - మెల్పక్కమ్ - చెంగల్పట్టు మీదుగా నటిపించనున్నారు. చెన్నై ఎగ్మోర్, తంబరం స్టేషన్లలో రైలు ఆగదు. కాగా, రైలు ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరపనున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications