వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసాధారణ పరిస్థితి: జల్లికట్టుపై రజినీ షాకింగ్ కామెంట్స్

ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత తమిళనాడులో ఆసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత తమిళనాడులో ఆసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట హాట్‌టాపిక్‌గా మారాయి. రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఆభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్న విషయం తెలిసిందే.

ప్రస్తుత పరిస్థితుల్లో రజనీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారంటూ ఇటీవల ఆయన అభిమానులు పెద్దఎత్తున పోస్టర్లు ముద్రించి చర్చకు దారి తీశారు. మరోవైపు రజనీకాంత్‌ కోసం పలు రాజకీయ పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.

ఇలాంటి తరుణంలో ప్రస్తుత తమిళనాడు పరిస్థితి గురించి రజనీకాంత్‌ వ్యాఖ్యలు మేధావులను సైతం ఆలోచనలో పడేశాయి. కాగా ఆదివారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్‌ జల్లికట్టుపై ఈ విధంగా స్పందించారు.

Tamil Superstar Rajinikanth Says He Supports Jallikattu

'పెద్దగా అందం, తెలివి లేకపోయినా తమిళ ప్రజలు నన్ను ఆదరించారు. జయలలిత మరణానంతరం తమిళనాడులో అసాధారణ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా జల్లికట్టు తమిళుల సంస్కృతి. ఎవరైనా సంస్కృతి విషయంలో కలుగజేసుకోకూడదు. ఎలాంటి నిబంధనలైనా విధించండి. అయితే జల్లికట్టుపై నిషేధం వద్దు' అని రజినీ వ్యాఖ్యానించారు.

పెద్దవారు మనకంటూ సంప్రదాయాన్ని ఏర్పరచారని.. దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. కాబట్టి జల్లికట్టు కచ్చితంగా జరగాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్ర పరిస్థితులను పేర్కొంటూ రజినీ చేసిన ఈ వ్యాఖ్యలతో రాజకీయ పార్టీల నేతలు, విశ్లేషకులు చర్చలకు దిగుతున్నారట. రాజకీయ ప్రవేశంపై రజినీ ఆసక్తి చూపిస్తున్నారా? అంటూ తమ విశ్లేషణలను కొనసాగిస్తున్నారట.

English summary
After top star Kamal Haasan extended his support for Jallikattu a few days ago, Tamil super star Rajinikanth said the bull-taming sport should be held in tune with Tamil culture.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X