వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాకు 22,573 కోట్లు ఇవ్వండి, అమ్మకు భారతరత్న ఇవ్వాలి,ప్రధానితో పన్నీర్ సెల్వం కీలక సమావేశం

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ని న్యూఢిల్లీలో కలిశారు. వర్థా తుఫాన్ కాకరణంగా నష్టానికి తమ రాష్ట్రానికి 22,573 కోట్లను ఇవ్వాలని ఆయన ప్రధానికి వినతిపత్రం సమ

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ :తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్రమోడీతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఇటీవల కురిసిన వర్థా తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన తమ రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆయన ప్రధానిని కోరారు. ఈ మేరకు తమ రాష్ట్రానికి 22,573 కోట్లు ఇవ్వాలని విన్నవించారు.

జయలలిత మరణించిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పన్నీర్ సెల్వం తొలిసారిగా న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమయ్యారు.వర్థా తుఫాన్ కారణంగా తమిళనాడు రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది.

panneer selivam

ఈ నష్టాన్ని పూడ్చుకొనేందుకుగాను తమ రాష్ట్రానికి 22,573 కోట్లను ఇవ్వాలని ఆయన ప్రధానికి వినతి పత్రం సమర్పించారు.రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ తుఫాన్ తీవ్రమైన నష్టాన్ని కల్గించింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం చేపడుతున్న సహయ చర్యలను సిఎం ప్రధానమంత్రికి వివరించారు.

ఇటీవలే మరణించిన జయలలితకు భారతరత్న ఇవ్వాలని ఆయన ప్రధానిని కోరారు. అంతేకాకుండా జయ కాంస్య విగ్రహన్ని పార్లమెంట్ ఆవరణలో పెట్టాలని ఆయన ప్రధానిని కోరారు.

English summary
tamilnadu cm panneerselvam met primeminister narendra modi on monday at delhi,he sought 22,573 crore relief package for cyclone hit areas in the state.cm briefed to pm modi ongoing restoration works following in cyclone effected areas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X