india today best state ranks 2022 : మళ్లీ టాప్ లో తమిళనాడు-వరుసగా నాలుగోసారి !
దేశవ్యాప్తంగా ప్రతీ ఏటా అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలకు జాతీయ మీడియా సంస్ధ ఇండియా టుడే అత్యుత్తమ రాష్ట్రాల ర్యాంకులు ప్రకటిస్తుంటుంది. గత కొన్నేళ్లుగా పలు విభాగాల్లో అత్యుత్తమ స్ధానంలో నిలిచిన రాష్ట్రాలకు ఈ ర్యాంకులు ఇస్తోంది. ఇందులో వరుసగా నాలుగో ఏడాది కూడా తమిళనాడుకు అగ్రస్ధానం దక్కింది.
ఇవాళ ప్రకటించిన ఇండియా టుడే అత్యుత్తమ రాష్ట్రాల జాబితాలో తమిళనాడు మరోసారి అగ్రస్దానం దక్కించుకుంది. 2018 నుంచి వరుసగా అగ్రస్దానంలో ఉంటూ వస్తున్న తమిళనాడు మరోసారి తన సత్తా చాటుకుంది. ఆర్దిక వ్యవస్ద, విద్య, ఆరోగ్యం, పాలన వంటి అంశాల్లో ఆయా రాష్ట్రాలు కనబరిచిన ప్రదర్శన ఆధారంగా ఇండియా టుడే ఈ ర్యాంకులు కేటాయిస్తోంది. ఈ జాబితాలో తమిళనాడు తర్వాతి స్ధానంలో హిమాచల్ ప్రదేశ్, కేరళ నిలిచాయి. హిమాచల్ ప్రదేశ్ గత మూడేళ్లుగా ఈ జాబితాలో రెండో స్ధానంలో నిలుస్తోంది.

తమిళనాడుకు ఈ జాబితాలో మొత్తం 2080 పాయింట్లకు గానూ 1321.5 పాయింట్లు దక్కాయి. దీంతో అగ్రస్ధానం లభించింది. రెండో స్ధానంలో నిలిచిన హిమాచల్ ప్రదేశ్ కు 1312.5 పాయింట్లు లభించాయి. మూడో స్ధానంలో ఉన్న కేరళ 1263.5 పాయింట్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ 1172.9 పాయింట్లతో 8వ స్దానంలోనూ, 1133.3 పాయింట్లతో తెలంగాణ 11వ స్ధానంలోనూ నిలిచాయి. మొత్తం 20 అత్యుత్తమ రాష్ట్రాల జాబితా మాత్రమే ప్రకటించారు. ఇందులో భారీ స్ధాయిలో సంక్షేమం అమలవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రదర్శన అత్యంత పేలవంగా ఉండటం విశేషం.

ఇండియా టుడే 2022కి తమిళనాడు ఉత్తమ రాష్ట్రంగా మళ్లీ ర్యాంక్ పొందింది. 2018 నుండి TN అగ్రస్థానంలో ఉంది. అన్ని రాష్ట్రాలు ఆర్థిక వ్యవస్థ, విద్య, ఆరోగ్యం, పాలన మొదలైన పారామితులపై మూల్యాంకనం చేయబడ్డాయి..#TamilNadu 1️⃣🙌












Click it and Unblock the Notifications