వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Target: మా సొంత పార్టీలో మాకే దిక్కులేదు, ఇక ప్రజల కథ గోవిందా, మా పార్టీని మాజీ సీఎం హైజాక్ చేసి !

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి మాయావతిని ఓడించడం మా లక్షం అని, మా కుటుంబ సభ్యులు స్థాపించిన బీఎస్ పీ పార్టీని హైజాక్ చేసిన ఆమెకు తగిన బుద్ది చెబుతామని కాన్షీరామ్ కుటుంబ సభ్యులు హెచ్చరించారు. బహుజన సమజవాది పార్టీ (బీఎస్ పీ)ని స్థాపించిన కాన్షీరామ్ కుటుంబ సభ్యులకే ఆ పార్టీలో విలువలేదని, ఇక ఆ పార్టీ నాయకులు ప్రజలకు ఏం సేవ చేస్తారని కాన్షీరామ్ కుటుంబ సభ్యులు మాజీ సీఎం మాయావతిని, ఆ పార్టీ నేతలను నిలదీస్తున్నారు. ఉత్తరప్రదేశ్ తో పాటు పంజాబ్ లో మాయావతి కనుసన్నల్లో ఉన్న బీఎస్ పీకి నామరూపాలు లేకుండా చెయ్యాలని ప్రజలకు మనవి చేశారు. మాకు ఏ పార్టీతో సంబంధం లేదని చెబుతున్న కాన్షీరామ్ కుుటంబ సభ్యులు బీఎస్ పీని ఓడించడానికి ఏ పార్టీ పని చేసినా ఆ పార్టీకి తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని బీఎస్ పీ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు.

Wife: రిటైడ్ ఆర్మీ కెప్టెన్, బంధువుల ఇంటి నుంచి వెళ్లి ఇంట్లో భార్యను కాల్చి చంపేశాడు, కోడలు చూసి !Wife: రిటైడ్ ఆర్మీ కెప్టెన్, బంధువుల ఇంటి నుంచి వెళ్లి ఇంట్లో భార్యను కాల్చి చంపేశాడు, కోడలు చూసి !

బీఎస్ పీ ఎలా పుట్టిందో ప్రజలకు తెలుసు

బీఎస్ పీ ఎలా పుట్టిందో ప్రజలకు తెలుసు

ఉత్తరప్రదేశ్ లో శాసనసభ ఎన్నికల వేడి మొదలైయ్యింది. శుక్రవారం లక్నోలో మాజీ శాసన సభ్యురాలు సావిత్రీబాయి పూలేకి సంబంధించిన ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి బహుజన సమాజవాది పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ కుటుంబ సభ్యులు హాజరైనారు. ఈ సందర్బంగా కాన్షీరామ్ కుటుంబ సభ్యులు బీఎస్ పీ అధినేత్రి మాయావతి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బహుజన సమాజ్ వాది పార్టీ ఎలా పుట్టిందో ప్రజలు అందరికి తెలుసని కాన్షీరామ్ సోదరి స్వర్ణ్ కౌర్ అన్నారు.

మా పార్టీని హైజాక్ చేసింది

మా పార్టీని హైజాక్ చేసింది


ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి మాయావతిని ఓడించడం మా లక్షం అని, మా కుటుంబ సభ్యులు స్థాపించిన బీఎస్ పీ పార్టీని హైజాక్ చేసిన ఆమెకు తగిన బుద్ది చెబుతామని కాన్షీరామ్ సోదరి స్వర్ణ్ కౌర్, ఆమె కుటుంబ సభ్యులు బీఎస్ పీ పార్టీకి చెందిన నాయకులను తీవ్రవస్థాయిలో హెచ్చరించారు.

 స్వార్థపరుల చేతుల్లో బీఎస్ పీ

స్వార్థపరుల చేతుల్లో బీఎస్ పీ

బహుజన సమాజ్ వాది పార్టీ ఎలా పుట్టిందో ప్రజలు అందరికి తెలుసని కాన్షీరామ్ సోదరి స్వర్ణ్ కౌర్ అన్నారు. పేద ప్రజలకు సేవ చెయ్యాలనే ఉద్దేశంతో మా అన్న కాన్షీరామ్ బహుజన సమాజ్ వాది పార్టీని స్థాపించారని, అయితే ఇప్పుడు ఆ పార్టీ మాయావతితో పాటు కొందరు స్వార్థపరుల చేతుల్లోకి వెళ్లిపోయిందని స్వర్ణ్ కౌర్ విచారం వ్యక్తం చేశారు.

మాకే దిక్కులేదు.... ఇక సామాన్య ప్రజల సంగతి సరేసరి

మాకే దిక్కులేదు.... ఇక సామాన్య ప్రజల సంగతి సరేసరి

బహుజన సమజవాది పార్టీ (బీఎస్ పీ)ని స్థాపించిన కాన్షీరామ్ కుటుంబ సభ్యులకే ఆ పార్టీలో విలువలేదని, ఇక ఆ పార్టీ నాయకులు ప్రజలకు ఏం సేవ చేస్తారని కాన్షీరామ్ సోదరి స్వర్ణ్ కౌర్, సోదరి అల్లుడు లఖ్వీర్ సింగ్ తోపాటు ఆయన కుటుంబ సభ్యులు మాజీ ముఖ్యమంత్రి మాయావతిని, ఆ పార్టీ నేతలను నిలదీశారు. మాయావతి, ఆమె చెమ్చాలు కలిసి బీఎస్ పీని ఓ ప్రైవేట్ సంస్థగా తయారు చేసి వారు లాభం పొందుతున్నారని కాన్షీరామ్ కుటుంబ సభ్యులు మండిపడ్డారు.

కచ్చితంగా మాయావతిని ఓడించాలి

కచ్చితంగా మాయావతిని ఓడించాలి

ఉత్తరప్రదేశ్ తో పాటు పంజాబ్ లో మాయావతి కనుసన్నల్లో ఉన్న బీఎస్ పీకి నామరూపాలు లేకుండా చెయ్యాలని కాన్షీరామ్ సోదరి స్వర్ణ్ కౌర్, సోదరి అల్లుడు లఖ్వీర్ సింగ్ తో పాటు వారి కుటుంబ సభ్యులు ఉత్తరప్రదేశ్ ప్రజలకు మనవి చేశారు. మాకు ఏ పార్టీతో సంబంధం లేదని చెబుతున్న కాన్షీరామ్ కుటుంబ సభ్యులు బీఎస్ పీని ఓడించడానికి ఏ పార్టీ పని చేసినా ఆ పార్టీకి తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని బీఎస్ పీ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు.

 పంజాబ్ లో కూడా బీఎస్ పీ అంతుచూస్తాం

పంజాబ్ లో కూడా బీఎస్ పీ అంతుచూస్తాం


పంజాబ్ లో కూడా బీఎస్ పీని ఓడించడానికి పని చేశామని, ఇక ముందు కూడా పని చేస్తామని, పంజాబ్ లో అకాలిదళ్ తో తాము పొత్తు పెట్టుకుంటున్నామని కాన్షీరామ్ సోదరి స్వర్ణ్ కౌర్ స్పష్టం చేశారు. బీఎస్ పీ పార్టీని స్థాపించిన కాన్షీరామ్ కుటుంబ సభ్యులకు ఆ పార్టీలో చోటు దక్కకుండా చేసిన మాయావతికి తగిన బుద్ది చెబుతామని ఆయన కుటుంబ సభ్యులు బీఎస్ పీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతిని తీవ్రవస్థాయిలో హెచ్చరించారు.

English summary
Target: Kanshi Rams family accuses Uttar Pradesh former CM Mayawati of usurping BSP party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X