తత్కాల్ టికెట్ బుకింగ్ కొత్త నిబంధనలు ఇవే: తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
న్యూఢిల్లీ: భారత రైల్వే శాఖ తత్కాల్ టికెట్ బుకింగ్‌లో కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఐఆర్‌సీటీసీ కొత్త నిబంధనల ప్రకారం.. తత్కాల్ టికెట్ బుకింగ్, క్యాన్సలేషన్(రద్దు), రిఫండ్ విధానాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.
- సాధారణంగా తత్కాల్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత టికెట్లు బుక్ అవుతాయి.
- ఇక నుంచి ఏసీ తత్కాల్ టికెట్ల బుకింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది.
- నాన్-ఏసీ టికెట్ల బుకింగ్ 11 గంటలకు ప్రారంభిస్తారు.
- కాగా, తత్కాల్ టికెట్ బుకింగ్స్‌లో సీనియర్ సిటిజన్స్‌కి కూడా ఎలాంటి రాయితీలు ఉండవు.
- టికెట్‌లో మార్పులు చేసుకునే అవకాశం కూడా లేదు.
- కావాలని తత్కాల్ టికెట్ రద్దు చేసుకుంటే ఎలాంటి రిఫండ్ రైల్వే శాఖ నుంచి రాదు.
- అయితే, తత్కాల్ టికెట్లు బుక్ చేసుకున్నాక.. రైలు 3 గంటలు అంతకుమించి ఆలస్యమైతే ఛార్జీలు పూర్తిగా తిరిగివ్వాలని కోరే అవకాశం కల్పించారు.
- ఒక మార్గంలో వెళ్లే రైలుకు తత్కాల్ టికెట్లు బుక్ చేసుకున్నాక.. ఆ రైలు రూటును మార్చినా, తాము ఎక్కాల్సిన స్టేషన్-దిగాల్సిన స్టేషన్ లేదా రెండూ ఆ మార్గంలో లేకపోయినా.. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుని ఛార్జీలు పూర్తిగా తిరిగివ్వాలని కోరవచ్చనని తెలిపింది.
- బుక్ చేసుకున్న క్లాసులో కాకుండా దిగువ తరగతి శ్రేణిలో ప్రయాణించాలని రైల్వే వర్గాలు కోరితే.. ఇష్టం లేని ప్రయాణికులు పూర్తి రిఫండ్ కోరవచ్చు.
- అంతేగాక, ప్రయాణికులు అందుకు అంగీకరిస్తే.. ఛార్జీల మధ్య తేడాను ప్రయాణికులకు రైల్వే చెల్లిస్తుంది.












Click it and Unblock the Notifications