ట్యాక్స్ పేయర్లకే టీకా ఫస్ట్: వాళ్లు చనిపోతే ఈ దేశం గతేంటీ? కిరణ్ మంజుదార్: ఆడుకున్న నెటిజన్లు

ముంబై: కిరణ్ మజుందార్ షా.. పరిచయం అక్కర్లేని పేరిది. ఫార్మాసూటికల్స్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతోన్న బయోకాన్ సంస్థ ఛైర్‌పర్సన్. దేశీయంగా అతిపెద్ద ఫార్మాసూటికల్స్ సంస్థకు అధినేత్రిగా పేరు తెచ్చుకున్నారు. సుదీర్ఘకాలం నుంచీ ఆ సంస్థకు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ఓ సక్సెస్‌ఫుల్ మహిళా పారిశ్రామికవేత్తగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ దుమారం రేపుతోంది. తీవ్ర వివాదాన్ని సృష్టించింది. ఈ ట్వీట్‌పై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఘాటు విమర్శలు, వ్యాఖ్యలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున వివాదాస్పదం కావడంతో దాన్ని తొలగించాల్సి వచ్చింది.

వ్యాక్సినేషన్‌పై ట్వీట్..

వ్యాక్సినేషన్‌పై ట్వీట్..


ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి దేశవ్యాప్తంగా ముమ్మరంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోన్న పరిస్థితుల్లో.. దాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన ట్వీట్ అది. కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆదాయపు పన్ను కట్టే వారికి మాత్రమే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కిరణ్ మజుందార్ షా ట్వీట్ చేశారు. ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు వేసిన తరువాతే.. మిగిలిన వారికి వ్యాక్సిన్ ఇవ్వాలనే సారాంశం వచ్చేలా ఆ ట్వీట్ చేశారామె. దేశంలో ఆదాయపు పన్ను కట్టేవారి సంఖ్య మూడు కోట్లు మాత్రమేనని, వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

పన్నులు కట్టేవారు మాత్రమే మనుషులా..

పన్నులు కట్టేవారు మాత్రమే మనుషులా..

ఆదాయపు పన్ను కట్టే ఆ మూడు కోట్ల మంది కరోనా వైరస్ వ్యాక్సిన్ బారిన పడి చనిపోతే దేశం పరిస్థితేమిటని ప్రశ్నించారు. పన్నులు చెల్లించే వారే లేకపోతే.. ఈ దేశం ఎలా మనుగడ సాగిస్తుందని అన్నారు. నాలుగే నాలుగు లైన్లు ఉన్న ఈ ట్వీట్.. తీవ్ర విమర్శలకు దారి తీసింది. పలువురు నెటిజన్లు ఆమె వైఖరిని తప్పు పడుతున్నారు. పన్నులు చెల్లించలేని వారు వ్యాక్సిన్‌కు అర్హులు కారా? అంటూ విరుచుకుపడుతున్నారు. పన్నులు కట్టేవారికి మాత్రమే ఈ దేశంలో నివసించే హక్కు ఉందా అని నిలదీస్తున్నారు. జోక్, సెన్సాఫ్ హ్యూమర్ పేరుతో ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఇది సరైన సమయం కాదంటూ హితబోధ చేస్తున్నారు.

కిరణ్ షా..కౌంటర్ అటాక్..

కిరణ్ షా..కౌంటర్ అటాక్..

తాను చేసిన ట్వీట్ పట్ల వివాదం చెలరేగడంపై కిరణ్ మజుందార్ షా కౌంటర్ అటాక్ చేశారు. తాను చేసిన కామెంట్‌లోని సెన్సాఫ్ హ్యూమర్‌ను అర్థం చేసుకోలేకపోతున్నారంటూ మండిపడ్డారు. దేశ ప్రజలు సెన్సాఫ్ హ్యూమర్‌ను పోగొట్టుకున్నట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. తాను ఆ ట్వీట్‌ను తొలగిస్తున్నానని పేర్కొన్నారు. ఆ ట్వీట్‌ పట్ల నెటిజన్లు ఎందుకు ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు. కరోనా వైరస్ వ్యాక్సినేషన్ వ్యవహారంలో ఇతరుల కంటే ఆదాయపు పన్ను చెల్లించే వారికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలంటూ తాను ఓ సలహా మాత్రమే ఇచ్చానని వివరణ ఇఛ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+