షాక్: రూ.3500 కోట్ల బినామీ ఆస్తుల జప్తు, కఠిన శిక్షలు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: బినామీ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా రూ.3500 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్టు ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బినామీ ఆస్తులపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది.

శుభవార్త: వ్యక్తిగత పన్ను పరిమితి రూ.3 లక్షలకు పెంపు యోచన?

దేశంలో నల్లధనాన్ని పూర్థిస్థాయిలో నిర్మూలించే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసినట్టు ప్రకటించింది. అయితే పెద్ద నగదు నోట్లను రద్దు చేసిన తర్వాత బినామీ ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ సీరియస్ గా దృష్టి కేంద్రీకరించింది.

శుభవార్త: 80 సీ సెక్షన్ కింద పెట్టుబడుల పరిమితుల పెంపుకు జైట్లీ యోచన?

అయితే బినామీ చట్టం ప్రకారంగా సరైన ఆధారాలు చూపని వారి ఆస్తులను ఆదాయపన్ను శాఖ జప్తు చేసింది. అయితే పలు రకాల్లో ఈ ఆస్తులను జప్పు చేసినట్టు అధికారులు ప్రకటించారు.

రూ.3500 కోట్ల ఆస్తుల జప్తు

రూ.3500 కోట్ల ఆస్తుల జప్తు

2016 నవంబర్ 1వ, తేది నుండి అమల్లోకి వచ్చిన బినామీ చట్టం కింద సుమారు రూ.3500 కోట్ల విలువైన ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ సీజ్ చేసింది.ఫ్లాట్లు, దుకాణాలు, ఆభరణాలు, వాహనాలతో కూడిన 900 బినామీ ఆస్తులను జప్తు చేసినట్లు ఆదాయ పన్ను విభాగం వెల్లడించింది

తాత్కాలిక జప్తు

తాత్కాలిక జప్తు

ఈ చట్టం కింద బినామీ ఆస్తులను (స్థిర, చరాస్తులు) ముందు తాత్కాలికంగా... ఆ తర్వాత పూర్తిగా జప్తు చేసే అధికారాలుంటాయి. అలాగే అనుచిత లబ్ధి పొందిన యజమాని, బినామీగా వ్యవహరించిన వారు, లావాదేవీలకు కారకులైన వారిపై న్యాయ విచారణ జరపనున్నారు.

 దోషులకు ఏడేళ్ళ శిక్ష

దోషులకు ఏడేళ్ళ శిక్ష

బినామీ ఆస్తి లావాదేవీల నిరోధక చట్టం కింద మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఐటీ విభాగం ప్రకటించింది.పాటు ప్రాపర్టీ మార్కెట్‌ విలువలో 25 శాతం దాకా జరిమానా కూడా విధించనున్నట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది.

రూ.110కోట్ల విలువైన స్థలం బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్

రూ.110కోట్ల విలువైన స్థలం బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్


రూ.110 కోట్ల విలువైన 50 ఎకరాల స్థలాన్ని బినామీ పేర్లతో ఒక రియల్‌ ఎస్టేట్‌ సంస్థ రిజిస్టర్‌ చేసిందని ఆదాయపన్ను శాఖ ప్రకటించింది.మరో కేసులో పెద్ద నోట్ల రద్దు అనంతరం ఇద్దరు అసెస్సీలు తమ ఉద్యోగులు, సంబంధీకులకు చెందిన ఖాతాల్లో దాదాపు రూ. 39 కోట్లు జమచేసినట్లు బయటపడిందని ప్రకటించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Stepping up action against black money evaders, tax authorities have attached over 900 properties valued at more than ₹3,500 crore. The action comes under the Benami Property Transactions Act, which came into force on November 1, 2016.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి