వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా సోకిన వారు టీబీ, టీబీ వచ్చిన వారు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిందే: కేంద్రం

|
Google Oneindia TeluguNews

కరోనా, టీబీ రోగులకు సంబంధించి కేంద్ర వైద్యారోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా సోకినవారు టీబీ పరీక్ష చేయించుకోవాలని సూచించింది. టీబీ రోగులంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలిపింది. చిన్నారులు కీలకమైన కోవిడ్‌ టీకాను పొందలేకపోతున్నారనే అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం స్పందించింది. అన్ని రాష్ట్రాలతో కోవిడ్‌ నెగిటివ్‌ ప్రభావాలను తగ్గించే చర్యలపై నిరంతరం చర్చిస్తున్నామని తెలిపింది.

టీకా కార్యక్రమంలో భాగంగా పిల్లలందరికీ టీకాలు అందిస్తామని భరోసా ఇచ్చింది. భారత్‌లోనే అధికంగా టీకా పొందని పిల్లలు ఉన్నారని, వీరి సంఖ్య సుమారు 35 లక్షలు అని యూనిసెఫ్‌ ఇటీవల ప్రకటించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ వివరణ ఇచ్చింది. కరోనా వైరస్ ఆరంభం నుంచి అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నామని వివరణ ఇచ్చింది. 2021 తొలి త్రైమాసికానికి దేశంలో 99 శాతం డీటీపీ3 కవరేజ్‌ చేశామని తెలిపింది. సార్వత్రిక టీకా ప్రోగ్రామ్‌లో భాగంగా అందరికీ టీకాలు తప్పక అందిస్తామని తెలిపింది.

TB Infection in Covid Patients, Govt Reiterates Need for Screening

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.

English summary
health ministry issued the advisory after reports of rising cases of Tuberculosis among patients who were infected with Covid-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X