వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీసీఎస్ తొలి సీఈఓ, ఐటీ పితామహుడు ఎఫ్‌సీ కోహ్లీ కన్నుమూత

|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ తొలి సీఈవో, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఎఫ్‌సీ కోహ్లీ(96) కన్నుమూశారు. భారత ఐటీ పరిశ్రమ పితామహుడిగా ప్రఖ్యాతిగాంచిన కోహ్లీ.. గురువారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 1969లో టాటా గ్రూప్‌లో చేరిన కోహ్లీ.. 1996 వరకు టీసీఎస్ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు.

Recommended Video

#RIPFCKohli : TCS First CEO Passes Away ఐటీ పితామహుడిగా ప్రఖ్యాతిగాంచిన కోహ్లీ!!

1995-96 మధ్య కాలంలో నాస్కామ్(నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్) సంస్థకు అధ్యక్షుడిగానూ ఉన్నారు. మార్చి 19, 1924లో ప్రస్తుతం పాకిస్థాన్‌లోని పెషావర్‌లో జన్మించారు కోహ్లీ. అక్కడే కాలేజీ విద్యనభ్యసించారు. ఆ తర్వాత కెనడాలోని క్వీన్స్ యూనివర్సిటీలో బీఎస్సీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.

 TCS first CEO FC Kohli Passes Away at 96

ఎఫ్‌సీ కోహ్లీ.. 1948లో మసాచుసెట్స్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్ చేశారు. 1951లో భారత్‌కు తిరిగి వచ్చిన కోహ్లీ.. టీసీఎస్‌లో చేరి 1970 కంపెనీలో డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. డైరెక్టర్‌గా ఉన్న కాలంలోనే డిజిటల్ కంప్యూటర్స్, పవర్ సిస్టమ్ కంట్రోల్ విభాగాల్లో బాధ్యతలు నిర్వహించారు.

కోహ్లీ మరణం పట్ల టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ ప్రగాఢ సంతాపం తెలిపారు. నాస్కామ్ కూడా ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేసింది. టీసీఎస్ కూడా కోహ్లీ మృతి పట్ల సంతాపం తెలిపింది. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆయనకు ఘనంగా నివాళులర్పించింది. టీసీఎస్‌కు ఆయన చేసిన సేవలను కొనియాడింది.

English summary
TCS first CEO FC Kohli Passes Away at 96.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X