సీరియస్: ముంబై లీలావతి ఆస్పత్రికి కొనకళ్ల తరలింపు

న్యూఢిల్లీ: కృష్ణా జిల్లా మచిలీపట్నం తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు కొనకళ్ల నారాయణను ఢిల్లీలోని రామ్‌మనోహర్ లోహియా (ఆర్ఎమ్ఎల్) ఆస్పత్రి నుంచి శుక్రవారం ముంబైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. కొనకళ్లకు బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచన మేరకు ఆయనను తరలించారు.

శుక్రవారం సాయంత్రమే కొనకళ్లకు బైపాస్ సర్జరీ చేయనున్నారు. గురువారం లోక్ సభ లో కొనకళ్ల నారాయణ గుండెపోటుకు గురై కిందపడిపోవడంతో హుటాహుటిన రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.

TDP MP Konakalla shifted Leelavathi hospital

పరీక్షలు నిర్వహించిన వైద్యులు కొనకళ్లకు బైపాస్ సర్జరీ చేయాలని సూచించడంతో ఈ మేరకు ఆయనను ముంబై తరలించారు. ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో ఉన్న కొనకళ్లను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్లమెంటు సభ్యులు కెవిపి రామచందర్ రావు, ఉండవల్లి అరుణ్ కుమార్, సబ్బం హరిలతో పాటు పలువురు ఎన్జీవో నేతలు పరామర్శించారు.

కొనకళ్ల ఆరగ్యో పరిస్థిపై ఆయన కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆయనకు గుండె జబ్బు ఉందని, గురువారంనాటి పార్లమెంటు సమావేశాల గొడవలో అది విషమించిందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+