2019 ఫ్లాష్ బ్యాక్: ఆప్ ఎంపీలకంటే ముందే టీడీపీ ఎంపీలు జంప్..నాడు ఏం జరిగింది..?

రాఘవ చద్ధా నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి చెందిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరడం దేశవ్యాప్త రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.ఈ పరిణామం కేవలం పార్టీ మార్పు మాత్రమే కాదు, భారత రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ (Anti-Defection Law) ఆధారంగా జరిగిన ఒక వ్యూహాత్మక అడుగు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ తగిలింది.ఆప్ పార్టీకి రాజ్యసభలో ఉన్న బలాన్ని సగానికి పైగా చీలుస్తూ, రాఘవ చద్ధాతో పాటు మరో ఆరుగురు ఎంపీలు బీజేపీ గూటికి చేరారు. అయితే, సాధారణంగా పార్టీ మారితే ఎంపీ పదవి పోవాలి, కానీ ఇక్కడ రాజ్యాంగంలోని ఒక ప్రత్యేక నిబంధన వీరికి రక్షణ కవచంలా మారింది.

tdp-to-bjp-shift-in-2019-how-anti-defection-law-allowed-rajya-sabha-merger

ఎవరు ఆ ఎంపీలు?

బీజేపీలో చేరిన ఏడుగురు ఎంపీలలో రాఘవ చద్ధా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ ఉండగా.. వారితో పాటు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేందర్ గుప్తా, విక్రమ్ సాహ్నీ కూడా ఉన్నారు. రాజ్యసభలో ఆప్‌కు మొత్తం 10 మంది సభ్యులు ఉండగా, అందులో ఏడుగురు అంటే మూడింట రెండొంతుల (2/3rd) బలం బీజేపీలో విలీనమైంది.

రాఘవ్ చద్దాకు జెన్ జీ దిమ్మతిరిగే షాక్..! ఏకంగా 10 లక్షల మంది..!
రాఘవ్ చద్దాకు జెన్ జీ దిమ్మతిరిగే షాక్..! ఏకంగా 10 లక్షల మంది..!

పదవి పోకుండా బీజేపీలో ఎలా చేరారు?

భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (ఫిరాయింపు నిరోధక చట్టం)ప్రకారం,ఒక పార్టీకి చెందిన ఎన్నికైన ప్రతినిధులు పార్టీ మారితే వారి సభ్యత్వం రద్దు అవుతుంది.కానీ,దీనికి ఒకే ఒక్క మినహాయింపు ఉంది:

  • మినహాయింపు: ఒక పార్టీలోని శాసనసభ లేదా పార్లమెంటరీ పక్షంలో కనీసం మూడింట రెండొంతుల మంది సభ్యులు ఏకగ్రీవంగా మరో పార్టీలో విలీనం కావాలని నిర్ణయించుకుంటే, వారిపై ఫిరాయింపు చట్టం వర్తించదు.
  • ఆప్ కేసులో: 10 మంది ఎంపీల్లో 7 మంది (66.6% కంటే ఎక్కువ) వెళ్లారు కాబట్టి, వారు తమ సభ్యత్వాన్ని కోల్పోరు. ఇప్పుడు వీరంతా అధికారికంగా బీజేపీ ఎంపీలుగానే గుర్తింపు పొందుతారు.
కేంద్ర మంత్రిగా రాఘవ్ చడ్ఢా?
కేంద్ర మంత్రిగా రాఘవ్ చడ్ఢా?

గతంలోనూ ఇలాగే జరిగిందా?

అవును, ఇలాంటి పరిణామమే 2019లో తెలుగుదేశం పార్టీ విషయంలో జరిగింది. అప్పట్లో రాజ్యసభలో ఉన్న ఆరుగురు టీడీపీ ఎంపీలలో నలుగురు (వైఎస్ చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు) బీజేపీలో చేరారు. అప్పట్లో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఈ విలీనాన్ని ఆమోదించారు. ఇప్పుడు ఆప్ ఎంపీలు కూడా అదే ఫార్ములాను అనుసరించారు.

రాఘవ చద్ధా ఏమన్నారంటే..
"రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న మూడింట రెండొంతుల మంది ఎంపీలం రాజ్యాంగ నిబంధనల ప్రకారం బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించుకున్నాం" అని రాఘవ చద్ధా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీనివల్ల సాంకేతికంగా ఇది ఫిరాయింపు కాకుండా, 'పార్టీ విలీనం'గా పరిగణించబడుతుంది.

రాజకీయాల్లో వ్యూహాలు ప్రతివ్యూహాలు సహజం. అయితే, రాజ్యసభలో ఆప్ తన బలాన్ని కోల్పోవడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ. చట్టంలోని సందులను వాడుకుని ఎంపీ పదవులను కాపాడుకుంటూ పార్టీ మారడం ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఫిరాయింపు నిరోధక చట్టం అసలు ఉద్దేశం నెరవేరుతుందా? లేక ఇలాంటి విలీనాలతో చట్టం బలహీనపడుతుందా? అన్నది రాజ్యాంగ నిపుణులు తేల్చాల్సిన విషయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+