కత్తితో బెదిరించి స్కూల్‌లోనే విద్యార్థినిపై టీచర్ రేప్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే తన దగ్గర చదువుకునే ఓ విద్యార్థిని(12)పై అత్యాచారానికి ఒడిగట్టాడు. కత్తితో బెదిరింపులకు గురిచేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన గురువారం ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా బదకేరలోని పాఠశాలలో చోటుచేసుకుంది. బ్రిజేందర్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థినిని పాఠశాలలోని ఓ గదిలోకి తీసుకెళ్లాడు.

కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరితోనైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు గురిచేశాడు. భయపడిపోయిన బాలిక అరుపులు, ఏడుపు విన్న స్థానికులు అప్రమత్తమై అక్కడికి చేరుకున్నారు. నిందిత ఉపాధ్యాయుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థినిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంఘటన జరిగిన పాఠశాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications