బెంగళూరు సిప్లా కంపెనీ వాటర్ సంప్ లో శవమై తేలిని టెక్కీ, టిఫిన్ కోసం వెళ్లి!
బెంగళూరు: ఉద్యోగం చేస్తున్న కంపెనీ నుంచి టిఫిన్ చెయ్యడానికి బయలుదేరి వెళ్లిన టెక్కీ అదే కంపెనీ ఆవరణంలోని నీటి సంప్ లో శవమై తేలిన ఘటన బెంగళూరు నగర శివార్లలోని హెబ్బగుడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
బెంగళూరు శివార్లలోని హెబ్బగడిలో నివాసం ఉంటున్న మధు మల్లేష్ (38) నీటి సంప్ లో శవమై కనిపించాడు. చిక్కమగళూరు జిల్లా మూడిగెరె ప్రాంతానికి చెందిన మధు బెంగళూరు చేరుకుని హెబ్బగుడిలో భార్య లత, నాలుగేళ్ల కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు.

జిగణి ఇండస్ట్రియల్ ఏరియాలోని బోమ్మసంద్రలోని సిప్లా కంపెనీలో 18 నెలల క్రితం మధు క్వాలిటీ కంట్రోల్ ఇంజనీరుగా ఉద్యోగంలో చేరాడు. గత బుధవారం మధు ఉద్యోగానికి వెళ్లాడు. తరువాత తాను టిఫన్ చేసి వస్తానని సాటి ఉద్యోగులకు చెప్పి కార్యాలయం నుంచి బయలుదేరాడు.
తరువాత మధు ఆచూకిలేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిప్లా కంపెనీ సిబ్బంది నీటి సంప్ లో మధు మృతదేహాం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హెబ్బగుడి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మధు మృతదేహాన్నివిక్టోరియా ఆసుపత్రికి తరలించారు. మధు తండ్రి మల్లేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications