ఐటీ పార్క్ పదో అంతస్తు నుంచి దూకి టెక్కీ ఆత్మహత్య

పోలీసుల కథనం ప్రకారం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎస్. రేష్మ తారమణిలోని అసెండస్ పార్క్‌లో ఉన్న ఓ కంపెనీలో అప్లికేషన్ డెవలపర్‌గా విధులు నిర్వహిస్తోంది. బుధవారం రాత్రి 9గంటలకు కంపెనీ భవనంలోని 10వ అంతస్తులో ఉన్న క్యాంటీన్ దగ్గర కిటికీ వైపునకు వెళ్లింది. ఈ విషయాన్ని క్యాంటీన్‌లో ఉన్న పలువురు ఉద్యోగులు గమనించినట్లు పోలీసులు తెలిపారు.
అయితే వారు చూస్తుండగానే ఆమె అక్కడ్నుంచి కిందికి దూకేసిందని ప్రత్యక్షసాక్షులు తెలిపినట్లు పోలీసులు చెప్పారు. ఆమె బహుశా స్లిప్ అయి కిందపడిపోయినట్లు తొలుత భావించామని వారు తెలిపినట్లు పోలీసులు వివరించారు. కాగా ఆమె కాళ్లకు చెప్పులు లేకపోవడంతో ఆమె కావాలనే అక్కడ్నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు వారు నిర్ధారించుకున్నారు.
ఘటన జరిగిన వెంటనే స్పందించిన కంపెనీ యాజమాన్యం రేష్మను ఆడియార్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రోయపెట్ట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఆత్మహత్యపై ప్రాథమిక విచారణ ప్రారంభించినట్లు తారమణి పోలీసులు తెలిపారు. కేరళ రాష్ట్రానికి చెందిన రేష్మ తను పనిచేసే కంపెనీకి సుమారు 3కిలో మీటర్ల దూరంలోని వేలచేరి దగ్గర ఓ వర్కింగ్ ఉమెన్ హాస్టల్‌లో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications