ఆన్ లైన్ లో రూ. 36 వేల కెమెరా ఆర్డర్: ఇటుక ఇచ్చారు

బెంగళూరు: రక్షా బంధన్ సందర్బంగా సోదరికి విలువైన బహుమతి ఇవ్వాలనుకున్న టెక్కీ షాక్ కు గురైనాడు. రూ 36,000 విలువైన కెమెరా ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తే అతనికి పార్శిల్ లో పెద్ద ఇటుక వచ్చింది.

ఆన్ లైన్ వ్యాపారంలో అగ్రస్థానంలో ఉన్న అమెజాన్ కంపెనీ ప్రతినిధులను సంప్రధించిన అతను చివరికి విసిగిపోయి వైట్ ఫీల్డ్ ప్రధాని రహదారిలోని మహదేవపుర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

బెంగళూరు నగరంలోని మారతహళ్ళిలో నివాసం ఉంటున్న రంజిత్ కుమార్ (26) సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను రక్షా బంధన్ సందర్బంగా సోదరికి కెనాన్ ఈఓఎస్ 700డి ఎస్ఎల్ఆర్ కెమెరా బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించాడు.

Techie orders Rs 36,000 Canon camera online, receives brick insted in Bengaluru.

ఆగస్టు 11వ తేదిన ఆన్ లైన్ లో అమెజాన్ ఇండియాలో కెమెరా బుక్ చేశాడు. కెమెరా తన కార్యాలయానికి పంపించాలని అడ్రస్ ఇచ్చాడు. ఆగస్టు 16వ తేదిన అతనికి పార్శిల్ వచ్చింది. క్రెడిట్ కార్డులో రూ. 36,000 చెల్లించాడు.

పార్శిల్ తీసుకు వెళ్లి విప్పి చూడగా పెద్ద ఇటుక కనపడటంతో షాక్ కు గురైనాడు. వెంటనే అమెజాన్ ప్రతినిధులను సంప్రధించాడు. అయితే వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో విసిగిపోయాడు. చివరికి మహదేవపుర పోలీసులకు ఫిర్యాదు చేశానని రంజిత్ కుమార్ చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+