అర్ధరాత్రి గదిలోకి దూరి బెంగళూర్లో టెక్కీపై రేప్!

బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి జార్ఖండ్‌కు చెందిన ఓ మహిళా సాఫ్టువేర్ ఇంజనీర్ పైన అత్యాచారం జరిగింది. జార్ఖండ్‌కు చెందిన ఐటి మహిళా ఉద్యోగిపై గురువారం అర్ధరాత్రి తర్వాత సుమారు మూడు గంటల సమయంలో ఆమె ఉంటున్న పేయింగ్ గెస్ట్ నివాసంలో అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది.

ఆమె రూమ్ మేట్ షిప్ట్ డ్యూటీ చేయడం కోసం వెళ్లాక అనుమానితుడు ఆమె గదిలోకి ప్రవేశించడాన్ని బట్టి అతను చాలా రోజులుగా ఆ ఇంటిపై నిఘా పెట్టి ఉంచి ఉండవచ్చని భావిస్తున్నారు. మొదట కొంత డబ్బు డిమాండ్ చేసిన ఆ వ్యక్తి ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

Techie raped in room

మరోవైపు ఆమెపై అత్యాచారయత్నం మాత్రమే జరిగిందనే వార్తలు కూడా వస్తున్నాయి. అర్ధరాత్రి తర్వాత లోనికి చొరబడిన దుండగుడు యువతిని బెదిరించి అత్యాచారానికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో తీవ్రంగా కొట్టి అక్కడి నుండి పరారయ్యాడని మరో కథనం వినిపిస్తుంది.

అతడిని పట్టుకునేందుకు అక్కడి సిబ్బంది, పేయింగ్ గెస్ట్ హౌస్‌లోని యువతులు విఫలయ్నం చేశారు. చికిత్స కోసం బాధితురాలిని సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+