బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లేడీ టెక్కీ రసిలా హత్య: కోటి రూపాయులు ఇచ్చిన ఇన్ఫోసిస్

|
Google Oneindia TeluguNews

పూణే/బెంగళూరు: పూణేలో పని చేస్తున్న కార్యాలయంలోనే హత్యకు గురైన టెక్కీ రసిలా రాజు (25) కుటుంబ సభ్యులకు ఆమె పని చేస్తున్న ఇన్ఫోసిస్ సాఫ్ట్ వేర్ సంస్థ కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించింది.

 Techie Rasila Raju’s death: Infosys to give Rs One crore compensations

మంగళవారం ఇన్ఫోసిస్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయం కేరళలో ఉన్న రసిలా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. రసిలా కుటుంబ సభ్యులకు అక్షరాల కోటిరూపాయలు పరిహారం చెల్లిస్తున్నామని వివరించింది.

కంపెనీలో పని చేస్తున్న సీనియర్లు రసిలాను వేధింపులకు గురి చేశారని ఆమె తండ్రి రాజు ఆరోపించిన విషయం తెలిసిందే. రసిలాను బెంగళూరుకు బదిలి చెయ్యకుండా వేధించారని, ఆమె ఆనారోగ్యంతో బాధపడుతుందని రాజు మీడియాకు చెప్పారు.

 Techie Rasila Raju’s death: Infosys to give Rs One crore compensations

ఇదే సందర్బంలో ఇన్ఫోసిస్ సంస్థ రసిలా కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. రసిలా బంధువులు వినోద్ కుమార్, సురేష్ పూణే చేరుకున్నారు. ఇన్ఫోసిస్ ఇస్తున్న పరిహారం తీసుకుని కేరళ చేరుకుంటున్నారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.

English summary
Infosys has informed in writing that the company will give a compensation of Rs One crore to the family of Kozhikode native Rasila.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X