గ్యాంగ్‌రేప్: అవమాన భారంతో యువతి ఆత్మహత్య
ఛండీగఢ్: సామూహిక అత్యాచారానికి గురైన ఓ యువతి అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో చోటు చేసుకుంది. సోనేపట్ జిల్లాలోని గొహానా నగరానికి చెందిన ఆ యువతి ఫిబ్రవరి 6వ సామూహిక అత్యాచారానికి గురైంది.
కాగా, పోలీసులు మాత్రం కేవలం ఒక్కరిమీదే కేసు పెట్టి, దాన్ని కేవలం 'అత్యాచారం' కేసుగా మార్చడంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురైందని, తనకు న్యాయం జరగడం లేదన్న ఆవేదనతోనే ఆమె ప్రాణాలు తీసుకుందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

పోలీసులు ఆమె వాంగ్మూలం పత్రాన్ని ఫోర్జరీ చేశారని, నిందితుల్లో చాలామంది స్వేచ్ఛగా బయటే తిరుగుతున్నారని ఆమె బంధువులు పేర్కొన్నారు.
ఏనుగు దాడిలో ఆరుగురి మృతి
పాట్నా: జనావాసాల్లోకి వచ్చిన ఓ మదపుటేనుగు బీభత్సం సృష్టించింది. ఆ ఏనుగు ఆరుగురు వ్యక్తులను తొక్కి చంపింది. ఏనుగు దాడిలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు, గాయపడిన వారికి రూ. లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు.












Click it and Unblock the Notifications