దారుణం: షాపుకొచ్చిన బాలికపై యజమాని లైంగిక దాడి

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. దుకాణానికి వచ్చిన పదమూడేళ్ల బాలికపై దుకాణ యజమాని లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత జరిగిన విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. బాలికకు రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులకు అసలు విషయం తెలిసింది.

దీంతో జరిగిన విషయంపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు అందించిన ఫిర్యాదు ప్రకారం ముజఫర్ నగర్ జిల్లాలోని షాపూర్ పట్టణంలో ఓ పదమూడేళ్ల బాలిక ఇంట్లోకి వస్తువులు కొనుగోలు చేసేందుకు సమీపంలోని ఓ దుకాణానికి వెళ్లింది.

Teenage girl raped by shopkeeper in lucknow

దుకాణంలో పనిచేస్తున్న షాన్వాజ్ అనే యువకుడు వస్తువుల పేరిట ఆ బాలికను దుకాణం లోపలికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయాన్ని బయటకు చెప్తే బాలికను చంపేస్తానంటూ బెదిరించాడు. అయితే జరిగిన విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పడంతో అసలు విషయం వెలుగు చూసింది.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ముజఫర్ నగర్‌లో ఇలాంటి ఘటనలు నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Teenage girl raped by shopkeeper in lucknow.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి