యూపీలో దారుణం: 10రోజులు నిర్బంధించి బాలికపై గ్యాంగ్ రేప్..

Subscribe to Oneindia Telugu

ముజఫర్‌నగర్‌: 16 ఏళ్ల మైనర్ బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్‌నగర్‌లో వెలుగుచూసింది. 10 రోజులపాటు బాలికను నిర్బంధించి అత్యంత దారుణంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

బలవంతంగా మాంసం తినిపించి, మతం మార్చుకోవాలంటూ ఒత్తిడి చేశారని బాలిక ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చినట్లు బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Teenage girl says gang-raped for 10 days, forced to eat meat

పోలీసుల కథనం ప్రకారం.. న్యూమండీ ప్రాంతంలోని కుక్రా గ్రామానికి చెందిన బాలిక ఈ నెల 6న ముజఫర్‌నగర్‌లోని తన మేనమామ ఇంటికి బయలుదేరింది. బస్సు కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఓ కారు వచ్చి ఆమె ముందు ఆగింది. కారులో ఉన్న నలుగురు యువకులు అస్లాం, అయ్యుబ్‌, అక్రమ్‌, సలీం తాము కూడా ముజఫర్‌నగర్‌కు వెళ్తున్నామని తమతో పాటు రావొచ్చని బాలికకు చెప్పారు.

యువకులు తెలిసినవారే కావడంతో బాలిక కూడా కాదనలేకపోయింది. కారులో వారితో పాటు ముజఫర్ నగర్ బయలుదేరగా.. మార్గమధ్యలో యువకులు ఆమెను తుపాకీతో బెదిరించి కళ్లకు గంతలు కట్టారు. ఈ విషయాన్ని బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది.

ఆపై కారులోనే తిప్పుతూ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, 10రోజుల పాటు నిర్బంధించి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. అంతేకాదు, మాంసం తినాలని, మతం మార్చుకోవాలని కూడా తనను ఒత్తిడి చేశారని బాలిక వాపోయింది. 10రోజుల పాటు ఆమెపై అత్యాచారం జరిపిన యువకులు.. ఈ నెల 16న బాలికను గంగా కాల్వ వంతెన వద్ద ఆమెను వదిలి వెళ్లిపోయారు.

జరిగిన సంఘటన గురించి పోలీసులకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే ఇంటికి చేరుకోగానే బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పగా వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు యువకుల కోసం గాలిస్తున్నారు. స్థానిక బీజేపీ నేతలు, కొన్ని హిందూ సంస్థలు ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 16-year-old girl in Uttar Pradesh’s Muzaffarnagar has filed a police complaint, alleging that four youths gang-raped her for 10 days after keeping her in captivity and forced her to eat meat and even exerted pressure on her to change her religion.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి